ఏపీలో తన ఇంటిని ఏర్పాటు చేసుకోనున్న విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎప్పుడో చెప్పారు. ఆచరణలో మాత్రం ఇప్పుడు అమలు చేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతికి సమీపంలో తన నివాసాన్ని పవన్ ఏర్పాటు చేసుకోనున్నారు. గుంటూరు జిల్లా ఖాజా టోల్ గేట్ సమీపంలో ఆయన కొత్తింటిని నిర్మించుకోనున్నారు.
ఈ ఉదయం ఆయన సతీమణితో కలిసి భూమిపూజ చేపట్టారు. దేవుడి పటాన్ని చేతులతో తీసుకొచ్చి.. భూమిపూజ కార్యక్రమ క్రతువులో పాల్గొన్నారు. తనకు బాగా దగ్గరైన సన్నిహితులను మాత్రమే భూమిపూజకు పిలిచినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకూ హైదరాబాద్ నుంచి ఏపీ రాజకీయాల్ని నడిపిన పవన్.. రానున్న రోజుల్లో ఏపీలో ఉంటూ రాజకీయ కార్యక్రమాల్ని చేపట్టాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా సొంతింటిని ఏర్పాటు చేసుకున్నారు.
పార్టీ కార్యాలయానికి సమీపంలోనే ఇంటిని నిర్మించుకోనున్నారు. రెండు ఎకరాల స్థలంలో ఆయన ఇంటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. మురగన్ హోటల్ రోడ్డులోని సాహితీ వెంచర్ లో ఆయన తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఈ శంకుస్థాపన కార్యక్రమం కోసం శనివారం రాత్రే విజయవాడకు పవన్ చేరుకున్నారు. భార్య.. పిల్లలతో సహా విజయవాడకు వచ్చిన పవన్.. తన రాక వివరాల్ని గోప్యంగా ఉంచారు. తన రాక విషయం బయటకు తెలిస్తే.. వెల్లువలా వచ్చే అభిమానుల తాకిడితో ఇబ్బందులు గురి అవుతాయన్న ఉద్దేశంతో వివరాల్నిబయటకు పొక్కనీయలేదని తెలుస్తోంది.తన పర్యటన షెడ్యూల్ ను ఏపీ డీజీపీకి ముందే ఇచ్చినట్లుగా చెబుతున్నారు. కుటుంబ సభ్యులు..కొందరు సన్నిహితుల సమక్షంలో అత్యంత నిరాడంబరంగా ఇంటి శంకుస్థాన కార్యక్రమాన్ని పవన్ నిర్వహించారు.
వీడియో కోసం క్లిక్ చేయండి
Full View