తొమ్మిది వేల వరకూ ఉన్న ఎంపీటీసీల్లో జనసేన తరఫున నామినేషన్లు దాఖలు అయ్యింది రెండు వేల స్థానాలకు. ఆ ఎన్నికల ప్రక్రియ జరుగుతుందా లేదా అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. అన్ని ఎంపీటీసీ స్థానాలకూ నామినేషన్లను దాఖలు చేయించడంలో కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ విఫలం అయ్యాడు. బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ.. బీజేపీ నామినేషన్లు దాఖలు చేసింది మరో 1800 ఎంపీటీసీ స్థానాలకు. ఇలా వీరి కూటమి సరిగ్గా సగం స్థానాలకు కూడా నామినేషన్లను దాఖలు చేయలేకపోయింది.
ఇలా వేసిన నామినేషన్లు సగం కూడా కాకపోయినా.. జనసేన అధిపతి మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. తమ పార్టీ తరఫున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయబోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు అడ్డుకున్నారు అనేది పవన్ కల్యాణ్ అభియోగం! టీడీపీ వాళ్లు ఈ ఆరోపణ చేస్తే అదో లెక్క. అయితే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అధినేతే ఓడిపోయిన పార్టీ ఈ ఆరోపణ చేస్తే అది కామెడీనే అవుతుంది.
స్థానిక ఎన్నికల్లో కేవలం రెండు వేల స్థానాలకు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయించుకున్న స్థాయిలో జనసేన.. తమను అడ్డుకున్నారని అడం కామెడీనే!అంత క్యాడరున్న తెలుగుదేశం పార్టీనే రెండు నియోజకవర్గాల్లో తమను అడ్డుకున్నారంటూ గట్టిగా ఆరోపిస్తూ ఉంది. అయితే జనసేన మాత్రం రాష్ట్రమంతా తమను అడ్డుకున్నారంటోంది!
అంతకన్నా కామెడీ ఏమిటంటే.. తమ పార్టీ కార్యకర్తలు ఈ విషయంలో తనకు ఫిర్యాదులు ఇవ్వాలని, వాటన్నింటినీ కేంద్ర హోం శాఖకు ఇస్తానంటూ పవన్ కల్యాణ్ మరో కామెడీ డైలాగ్ వేశారు! అక్కడికి కేంద్ర హోం శాఖ తమకు చుట్టం అయినట్టుగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. సినిమాల్లో హీరో అయిన పవన్ కల్యాణ్ రాజకీయాల్లో మాత్రం కమేడియన్ తరహా డైలాగులే వేస్తున్నారు
ఎంత బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మాత్రం.. ఇలా కామెడీలు చేసేయాలా! రెండు వేల స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసి.. ఏడువేల స్థానాల్లో తమను అడ్డుకున్నారంటూ ఆరోపించేయడం కామెడీ కాదా? ఆల్రెడీ సినిమాల వైపు వెళ్లిన పవన్ కల్యాణ్ మళ్లీ రాజకీయాల గురించి ఇలా మాట్లాడి ఎందుకు అభాసుపాలవుతున్నట్టు?