ఆలూ లేదూ చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం అని ఒక సామెత. ఇప్పుడు జనసేన అధిపతి పవన్ కల్యాణ్ విషయంలో వినిపిస్తున్న ఊహాగానాలు కూడా అదే తీరిన ఉన్నాయి. ఇలా బీజేపీతో చేతులు కలిపాడో లేదో.. ఇంతలోనే పవన్ కల్యాణ్ కు కేంద్రమంత్రి పదవి అంటూ కొంతమంది హడావుడి మొదలుపెట్టారు! ఒకవైపు పవన్ కల్యాణ్ రాజకీయ తీవ్ర విమర్శల పాలవుతూ ఉంది. మొన్నటి వరకూ కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకుని, ఆరు నెలలు అలా గడిచాయో లేదో.. ఇంతలోనే కాషాయ పార్టీతో పవన్ చేతులు కలపడం తీవ్ర విమర్శలకు దారి తీస్తూ ఉంది.
ఎన్నికల సమయంలో బీజేపీని రకరకాలుగా విమర్శించిన వారిలో పవన్ కల్యాణ్ కూడా ఒకరు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి.. బీజేపీ పాక్ తో యుద్ధాన్ని తెస్తోంది అన్నట్టుగా విమర్శించిన వ్యక్తి కూడా పవన్ కల్యాణే. తను మోడీకి బంధువు కాదని, అమిత్ షాకు తమ్ముడిని కాదంటూ.. ఏదేదో మాట్లాడాడు పవన్. అలాంటి వ్యక్తి ఇప్పుడు బీజేపీతో చేతులు కలిపాడు. అప్పుడంతా జగన్, బీజేపీలు ఒప్పందం చేసుకున్నాయని విమర్శించిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు అదే బీజేపీతో ఒప్పందం చేసుకున్నాడు.
ప్రస్తుతానికి అయితే పొత్తు మాత్రమేనట. ముందు ముందు జనసేన బీజేపీలోకి విలీనం అయిపోయి.. మాయం అయిపోతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గతంలో ప్రజారాజ్యం తీరున ఇప్పుడు జనసేన గాయాబ్ అవుతుందనే అభిప్రాయాలున్నాయి. అలా పవన్ రాజకీయం విమర్శల పాలవుతూ ఉంది.
ఇలాంటి నేపథ్యంలో కూడా పవన్ వీరాభిమాన వర్గాలు ఆయన కేంద్రమంత్రి అవుతాడంటూ ప్రచారం చేసుకుంటూ ఆనందపడుతున్నారు. వెనుకటికి చిరంజీవి ఇలాంటి విలీనంతో కేంద్రమంత్రి పదవి దక్కిన మాట నిజమే. అయితే అప్పుడు చిరంజీవి వెంట 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారి అవసరం కాంగ్రెస్ కు ఏర్పడింది. జగన్ దూరం కావడంతో.. చిరుతో రాజకీయాన్ని నడిపించాలని కాంగ్రెస్ అధిష్టానం కలలు పెట్టుకుంది. దీంతో అప్పుడు చిరంజీవికి మంత్రి పదవి దక్కింది కేంద్రంలో. పవన్ విషయానికి వస్తే ఇతడు కనీసం ఎమ్మెల్యేగా కూడా నెగ్గలేకపోయారు. గెలిచిన ఒక్కగానొక్క
ఎమ్మెల్యే కూడా వెంట నిలిచేలా లేడు. అది కూడా పవన్ ఇప్పటికే రాజకీయంగా విమర్శలకు గురి అవుతూ ఉన్నాడు. ఇలాంటి నేపథ్యంలో అతడికి పదవి లభిస్తుందంటే.. ఏ మాత్రం నమ్మశక్యంగా లేదని పరిశీలకులు
అభిప్రాయపడుతూ ఉన్నారు.