బ‌డ్జెట్ అద్బుతం..వైసీపీదే త‌ప్పు..ప‌వ‌న్ డొల్ల వాద‌న‌!

Update: 2020-02-02 04:10 GMT
కేంద్ర బ‌డ్జెట్ అద్భుత‌మంటూ ప్ర‌శంసించారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్. ఇటీవ‌లే భార‌తీయ జ‌న‌తా పార్టీకి మిత్రుడు అయిన ప‌వ‌న్ క‌ల్యాణ్.. అందుకు త‌గిన‌ట్టుగా మాట్లాడాడు. బీజేపీకి దోస్తుగా ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్.. బ‌డ్జెట్ విష‌యంలో ప్ర‌ధాన‌మంత్రి మోడీని, ఇటీవ‌లే త‌న‌కు అపాయింట్ మెంట్ ఇచ్చిన  కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ను ప్ర‌శంసించారు. ఆర్థిక మాంద్యం వేళ అద్భుత‌మైన బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టారంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ వారిని ప్ర‌శంసించారు. బ‌డ్జెట్ లోని వివిధ అంశాల‌ను ప‌ట్టుకుని ప‌వ‌న్ క‌ల్యాణ్ వారిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌శేశ పెట్టిన బ‌డ్జెట్ గొప్ప ఆకాంక్ష‌ల‌తో కూడుకున్న‌ది అని, ఆర్థిక ప్ర‌గ‌తిని సాధించేలా ఉంద‌ని, ప్ర‌జా శ్రేయ‌స్సును క‌లిగిస్తుంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పుకొచ్చారు. రైతాంగ రుణాల కోసం 2.83 ల‌క్ష‌లు కేటాయించార‌ని ఇది స్వాగ‌తించే అంశ‌మ‌ని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. ఓవ‌రాల్ గా గొప్ప ల‌క్ష్యాల‌ను పెట్టుకున్నార‌ని.. మోడీకి థ్యాంక్స్ అని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు.

ఇక ఏపీకి కేంద్ర బ‌డ్జెట్ లో అన్యాయంపై మాత్రం ప‌వ‌న్ క‌ల్యాణ్ డొల్ల‌గా స్పందించారు. ఏపీకి ప్ర‌త్యేక హోదాతో స‌హా అనే అంశాల్లో మోసం జ‌రిగింద‌నే అభిప్రాయాలు స‌ర్వ‌త్రా వ్య‌క్తం అవుతున్నాయి. ఈ విష‌యంలో కేంద్రంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ విష‌యంలో డొల్ల వాద‌న వినిపించారు.

ఏపీకి కేటాయింపులు జ‌ర‌గ‌క‌పోవ‌డానికి కార‌ణం రాష్ట్ర ప్ర‌భుత్వం అని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ర‌ద్దులు, కూల్చివేత‌ల మీద దృష్టి పెట్టింద‌ని, బ‌డ్జెట్ మీద కాద‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు. అందుకే ఏపీకి నిధుల కేటాయింపు జ‌ర‌గ‌లేద‌ని చెప్పుకొచ్చారు.

ఇలా ఏపీకి జ‌రిగిన అన్యాయం విష‌యంలో కూడా బీజేపీ తీరును స‌మ‌ర్థించే ప్ర‌య‌త్నం చేశారు ప‌వ‌న్ క‌ల్యాన్. రాష్ట్ర ప్ర‌భుత్వం వ‌ల్ల‌నే కేంద్రం నిధుల కేటాయింపు చేయ‌లేద‌ని అన‌డం డొల్ల‌గా ఉంది. బీజేపీ మొద‌టి నుంచి ఏపీని చిన్న చూపు చూస్తేనే  ఉన్న సంగ‌తి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధికారంలో  ఉన్న‌ప్పుడు.. దానితో మిత్ర‌ప‌క్షంగా ఉంటూ కూడా.. ఏపీకి బీజేపీ చేసింది ఏమీ లేదు. ఇప్పుడు కూడా అదే తీరున వ్య‌వ‌హ‌రిస్తూ ఉంది. అయినా ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం కేంద్రం మంచిదంటూ వెన‌కేసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేశారు. మ‌రి ఈ డొల్ల వాద‌న‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌జ‌ల‌కు ఏం చెప్ప‌ద‌లుచుకున్న‌ట్టు?


Tags:    

Similar News