కలసి వచ్చే పార్టీలంటే పవన్ ఉద్దేశం ఏంటి?

Update: 2016-10-15 12:45 GMT
భీమవరం ఆక్వా ఫుడ్ పార్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా , అక్కడి ప్రజా పోరాటానికి మద్దతుగా తాను ఉద్యమించబోతున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం తన ప్రెస్ మీట్ లో విస్పష్టంగా ప్రకటించేశారు. అంతవరకు అనుమానం లేదు.

అయితే ఆయన ప్రభుత్వానికి ఓ హెచ్చరిక మాత్రమే చేసి.. కమిటీ వేయాల్సిందిగా కోరారు. చివరగా అసలు హెచ్చరిక చేశారు. ఇప్పటికీ ప్రభుత్వం గనుక తన డిమాండు పట్ల స్పందించకపోతే , ప్రస్తుతం ఉన్నతీరులోనే మొండి వైఖరినే అవలంబిస్తే గనుక.. ప్రత్యక్ష పోరాటానికి దిగుతానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ విషయంలో కలిసి వచ్చే పార్టీలతో పాటూ కలసి పోరాడడానికి తాను సిద్ధం అని పవన్ కల్యాణ్ ప్రకటించారు.

అయితే ఇక్కడ పవన్ గుర్తించాల్సింది ఏంటంటే.. స్థానిక రైతుల ఇష్టానికి వ్యతిరేకంగా వారిని అణగదొక్కుతూ సాగుతున్న భీమవరం ఆక్వా ఫుడ్ పార్క్ వ్యవహారంలో జన సేన తప్ప.. మిగిలిన రాజకీయ పార్టీలన్నీ ఎప్పటినుంచో పోరు పథంలో ఉన్నాయి. వామపక్షాల వారు ఉద్యమాలు చేసి లాఠీ దెబ్బలు కూడా తిన్నారు. జగన్ వారి వెంట నిలుస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ కూడా.. ఇక్కడ ఉద్యమంలో పాల్గొన్నది. ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చింది  పవన్ కల్యాణ్ మాత్రమే. ఆయనకు నిజంగా పోరాడాలని ఉంటే గనుక.. జరుగుతున్న పోరాటాల్లో తాను వెళ్లి ఆయా పార్టీలతో కలవాలి గానీ.. కలిసి వచ్చే పార్టీలను కలుపుకుపోతా.. అంటూ తానేదో పెద్ద పార్టీ అయినట్లుగా మాట్లాడడం కరక్టు కాదనే అభిప్రాయం విశ్లేషకుల్లో వ్యక్తం అవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News