కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మీడియాతో తక్కువ మాట్లాడతారు. ఇప్పుడంటే రాజకీయాల్లోకి వచ్చి.. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉండటంతో ప్రజల్ని కలుస్తున్నారు కానీ లేకుంటే తనదైన ప్రపంచంలో బతికేస్తుంటారు. వీలైనంతవరకూ జనాలకు దూరంగా.. తనకు ఇష్టమైన పరిసరాల్లో పవన్ బతికేస్తుంటారు. తాజాగా ఉత్తరాంధ్ర పర్యటన నేపథ్యంలో నిరసన కవతాను చేపట్టారు. ఈ నేపథ్యంలో తన సినీ.. రాజకీయ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు.
తనకు సిగ్గు ఎక్కువని.. బిడియం కూడా ఉంటుందని చెప్పారు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో తాను చాలా బిడియంగా ఉండేవాడినన్నారు. తాను నటించిన సుస్వాగతం సినిమా షూట్ లో బస్సుపైకి ఎక్కి వేలాది మంది చూస్తుండగా డ్యాన్స్ వేయాలని చెప్పారని.. దీనికి తాను చాలా భయపడినట్లు చెప్పారు.
ఆ షాట్ ఎలా చేయాలో అర్థంకాక తన వదినకు ఫోన్ చేసినట్లు చెప్పారు. తాను సినిమాల్లో నటించటానికి సరిపోనని.. ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినట్లు చెప్పారు. ఆ సమయంలో వదిన తనకు సర్ది చెప్పినట్లుగా వెల్లడించారు. ఆ సినిమా తర్వాత పవన్ పవర్ స్టార్ గా మారటం.. కోట్లాది మంది ఫ్యాన్స్ ను సాధించటం తెలిసిందే.
చివరగా ‘అజ్ఞాతవాసి’ మూవీని చేసిన పవన్.. ఇప్పుడు తన ఫోకస్ అంతా రాజకీయాల మీదనే పెట్టటం తెలిసిందే. సమీప భవిష్యత్తులో సినిమా వంక చూసేందుకు ఇష్టపడని పవన్.. రాజకీయాల మీదనే తన దృష్టినంత కేంద్రీకృతం చేయాలని భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల వరకూ ఇలాంటి మైండ్ సెట్ లోనే పవన్ ఉండే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.