అనుభవం ఆవేశాన్ని తగ్గిస్తుందని చెబుతుంటారు. అంతేకానీ.. అవసరమానికి మించిన ప్రాధేయపడాల్సిన అవసరం ఉందా? అన్నది ప్రశ్న. న్యాయంగా.. ధర్మసమ్మతంగా రావాల్సిన వాటి మీద పోరాడాలే కానీ.. ప్రాధేయపడాల్సిన అవసరం ఏముంది? యుద్ధం చేసుకుంటూ పోతానని చెప్పే పవన్ లాంటి పెద్ద మనుషులు.. ఉన్నట్లుండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు చేతులు జోడించి మరీ వేడుకోవాల్సిన అవసరం ఉందా? అన్నది ప్రశ్న.
రాష్ట్రాల మధ్య తగాదాలు పెట్టే తీరును తప్పు పట్టాలి. నిజాలు విప్పి చెప్పాలి. రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు అర్థమయ్యేలా రాజకీయ కుట్రలను తెలియజేయాల్సిందే కానీ.. జేతులు జోడించి వేడుకున్నా.. వినమ్రతతో వంగి వంగి దండాలు పెట్టినా ఫలితం ఉంటుందా? అన్నది ప్రశ్న. తన రాజకీయ ప్రయోజనం తప్పించి మరింకేమీ పట్టనట్లుగా వ్యవహరించే వారిని మంచితనంతో ఎంతగా బ్రతిమిలాడుకున్నా ఎలాంటి ఫలితం ఉండదు. ఆ విషయం వందలాది పుస్తకాలు చదివిన పవన్ కల్యాణ్ కు తెలియని విషయమా? అన్నది ప్రశ్న.
పార్టీ పెట్టి ఐదేళ్లు పూర్తి అయిన వేళ.. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం పేరుతో రాజమహేంద్రవరంలో నిర్వహించిన సభలో మాట్లాడిన పవన్ మాటలు ఆసక్తికరంగానే.. ఆశ్చర్యానికి గురి చేసేలా ఉన్నాయని చెప్పాలి. పవన్ లో ఆవేశం పాళ్లు ఎక్కువన్న మాట తెలుగు ప్రజలందరికి తెలిసిన విషయమే. అలాంటి పవన్.. ఆవేశానికి బదులు వినమ్రతతో వంగి పోయినట్లుగా మాట్లాడాల్సిన అవసరం ఉందా? అన్నది క్వశ్చన్. ఓవైపు కేసీఆర్ ను ప్రాధేయపడినట్లుగా వ్యాఖ్యలు చేసిన పవన్.. జగన్ ను ఉద్దేశించి మాత్రం అందుకు భిన్నంగా విమర్శలు గుప్పించటం కనిపిస్తుంది.
విద్వేష రాజకీయాలు అక్కర్లేదనుకున్నప్పుడు పక్క రాష్ట్రంతోనూ.. అక్కడి రాజకీయ ప్రత్యర్థులతో ఎలా వ్యవహరిస్తారో.. సొంత రాష్ట్రంలోని ప్రత్యర్థులతోనూ అదే తీరును ప్రదర్శించాలి. కేసీఆర్ విషయంలో పవన్ తీరుకు తగ్గట్లే.. జగన్ విషయంలో అదే ధోరణితో ఉండాలి. కానీ.. అందుకు భిన్నంగా ఆయన విమర్శలు గుప్పిస్తుండటం చూస్తుంటే కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మీ గొడవలతో దయచేసి రాష్ట్రాన్ని బలి చేయకండి అంటూ విన్నవించుకున్న పవన్.. ,కేసీఆర్ కు చేతులు జోడించి మరీ తాను వేడుకుంటున్నట్లుగా చెప్పి.. రాష్ట్రం విడిపోయిన తర్వాత కొందరు దొడ్డిదారిన ఏపీకి వచ్చారని.. విభజన నేపథ్యంలో ఇప్పటికే ఏపీ దెబ్బ తిందన్నారు.
ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని.. మళ్లీ ఇంకోసారి తమను ఇబ్బంది పెట్టొద్దని కోరారు. కేసీఆర్ ను అంతగా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా? అన్నది ప్రశ్న. ఏదో చిన్న పాటి గొడవలు ఉంటాయని.. వాటిని సామరస్యంగా పరిష్కారాలకు ప్రయత్నిస్ద్దామని చెప్పారు. ఏపీ ప్రజలు అలసిపోయారని.. దశాబ్దం పాటు మీ చేతిలో తిట్టు తిన్నామన్న పవన్.. ఇకపై అందరి కలిసి ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఆయచేసి ఆంధ్రుల్ని వదిలేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లుగా చెప్పిన పవన్ మాటలు చూస్తుంటే.. ఇదే వ్యక్తి గతంలో తన ప్రత్యర్థుల విషయమై ఘాటుగా రియాక్ట్ కావటం లాంటివి పవన్ కు సూట్ కావటం లేదన్న మాట వినిపిస్తోంది. చూస్తుంటే.. తాజా టార్గెట్ మొత్తం జగన్ చుట్టూ తిరుగుతున్నట్లుగా ఉందని చెప్పాలి. కేసీఆర్ ను వదిలేసి.. చంద్రబాబుతో లోగుట్టుగా కొన్ని అంశాల మీద ఒక ఒప్పందానికి వచ్చాకే పవన్ టోన్ లో మార్పు వచ్చిందా? అన్న కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరీ వాదనల్లో నిజం ఎంతన్నది కాలమే స్పష్టత ఇవ్వాలి.