సమకాలీన రాజకీయాల్లో ఒక పార్టీ అధినేతను మరో పార్టీ అధినేత నిండు మనసుతో పొగడటం లాంటివి చూస్తామా? పాలకులుగా ఉన్న వారు ఎంత మంచి పని చేసినా.. అందులో ఏదో ఒక లోపాన్ని వెతకటం.. దాన్ని హైలెట్ చేయటం.. నువ్వు పీకిందేమీ లేదులే బాబు.. అంత హడావుడి వద్దన్నట్లుగా వ్యాఖ్యలు చేయటాన్ని చూస్తాం. ఇక.. చంద్రబాబు లాంటోళ్లు అయితే.. మీరిప్పుడే చేశారు..మేం ఎప్పుడో చేశామో తెలుసా? అంటూ చెప్పే లెక్కల్ని వినటం మనకెప్పటి నుంచో అలవాటుగా మారింది.
అందుకు భిన్నంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అభినందనలు తెలపటమే కాదు.. ఆయన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆనందాన్ని వ్యక్తం చేయటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలుమార్లు తీవ్రస్థాయిలో జగన్ పై విమర్శలు.. ఆరోపణలు చేసిన పవన్.. తొలిసారి ప్రశంసలు కురిపించటం గమనార్హం. ఇంతకూ పవన్ ఏ విషయంలో సీఎం జగన్ ను అభినందించారన్న విషయానికి వెళితే.. మహ్మమారికి చెక్ పెట్టేందుకు వీలుగా పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించటం.. అత్యవసర సేవల్ని అందించేందుకు వీలుగా అంబులెన్సుల్ని భారీగా కొనుగోలు చేసి.. వాటిని ఒకేసారి రాష్ట్రం నలుమూలలకు వెళ్లేలా చేయటం పై ఆయన అభినందనలు తెలియజేశారు.
ట్విట్టర్ లో ఒక ట్వీట్ పోస్టు చేసిన ఆయన.. అత్యవసర సేవల్ని అందించే అంబులెన్సుల్ని.. ప్రస్తుతం ఉన్నఅత్యవసర పరిస్థితుల్లో ఆరంభించటం అభినందనీయం అని పేర్కొన్నారు. అంతేకాదు.. గడిచిన మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా.. ప్రభుత్వంపని చేస్తున్న తీరుపైనా ఆయన అభినందనలు తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని ఈ స్థాయిలో పొగడటం.. అందునా ఫైర్ బ్రాండ్ లాంటి పవన్ కల్యాణ్ నోటి నుంచి రావటం ఆసక్తికరంగా మారింది.
పవన్ లాంటి నేత ఇంతలా పొగిడినా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు మాత్రం జీర్ణించుకోలేక పోతున్నట్లు చెబుతున్నారు. పవన్ ప్రశంసల్ని వారు స్వీకరించలేక పోతున్నట్లు చెబుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. తన ట్వీట్లలో జగన్మోహన్ రెడ్డి ని జగన్ రెడ్డి గా పేర్కొనే పవన్.. ఈసారి కూడా తన పాత అలవాటును మార లేదు. కాకుంటే శ్రీ జగన్ రెడ్డి గారు అని పేర్కొన్నారు. జగన్ రెడ్డి అంటూ పవన్ పేర్కొన్న ప్రతి సారీ ఘాటు గా రియాక్ట్ అయ్యే జగన్ పరివారం.. ఇప్పుడు పొగడ్తలు కురిపించిన వేళ లో పవన్ నోటి నుంచి వచ్చిన జగన్ రెడ్డి పిలుపు పై ఎలా స్పందించాలన్నది వారికో సమస్య గా మారిందంటున్నారు. మొత్తానికి పొగిడి కూడా జగన్ పరివారానికి పరీక్ష పెట్టిన పవన్ ను అభినందించాల్సిందే.