ప్రారంభమైన రైతు సౌభాగ్య దీక్ష ..టెంక్షన్ పడుతున్న పవన్ !

Update: 2019-12-12 06:20 GMT
జనసేన అధినేత పవన్ కళ్యాన్ రైతుల కోసం రైతు సౌభాగ్య దీక్షకు దిగిన విషయం తెలిసిందే. కాకినాడ కేంద్రంగా రైతులకు మద్దతుగా ఈ దీక్ష చేస్తున్నారు. జనసేన పార్టీ ఏర్పాటు చేసిన తరువాత అనేక అంశాల మీద పోరాటాలు చేసినా..దీక్షకు దిగటం మాత్రం ఇదే తొలిసారి కావడం విశేషం. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల పైన తీవ్రంగా స్పందిస్తున్న పవన్.  ఈ దీక్షా వేదిక ద్వారా తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచనున్నారు అని తెలుస్తుంది.

ఇకపోతే ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత  , పవన్ , జగన్  మధ్య రాజకీయంగా తీవ్ర స్థాయిలో వాదోపవదాలు జరుగుతున్నాయి . ఇసుక అంశం.. రాజధాని.. ఇంగ్లీషు మీడియం స్కూళ్ల విషయంలో ముఖ్యమంత్రి జగన్ తీరున పవన్ తీవ్రంగా విమర్శించారు. ఇసక కొరత..భవన నిర్మాణ కార్మికులకు అండగా విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించారు. ఆ తరువాత ఇప్పుడు రైతుల సమస్యల మీద దీక్షకు దిగారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి బకాయిలు చెల్లించాలని, మిల్లర్లకు ఇచ్చే ధాన్యానికి రశీదులు ఇవ్వాలనే డిమాండ్లపై పవన్‌ దీక్ష చేస్తున్నారు. అయితే , దీనిపై ఇప్పటికే ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా ఒక ప్రకటన చేయగా ..జనసేన ఈ దీక్షలో ప్రభుత్వాన్ని ఏమి డిమాండ్ చేస్తుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే ఒకవైపు సీఎం జగన్ వైఖరిని , అయన పెట్టే పథకాలని అధినేత పవన్  ఏకరువు పెడుతుంటే ..జనసేన నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మాత్రం సీఎం జగన్ కి మద్దతు తెలుపుతున్నారు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత దక్కటం లేదనే అభిప్రాయంతో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. గతంలోనూ బడ్జెట్ పైన ప్రసంగం సమయంలోనే ఇదే రకంగా వ్యవహరించారు. అయితే, పార్టీలో తనకున్న ప్రాధాన్యత గురించి తరువాత మాట్లాడుదామంటూ రాపాక వర ప్రసాద్ చేసిన కామెంట్లు ఇప్పుడు కొత్త చర్చకు కారణమయ్యాయి. అదే సమయంలో తమ పార్టీ అధినేత చేస్తన్న దీక్షకు హాజరు కావటం లేదని ఆయన స్పష్టం చేసారు. అసెంబ్లీ సమావేశాలు ఉన్న కారణంగానే వెళ్లటం లేదన్నారు. అలాగే ఎమ్మెల్యే రాపాక వైసీపీ తో సన్నిహితంగా ఉంటున్నారు అనే ప్రచారం జరుగుతుంది. దీనిపై పవన్ ఏ విధంగా స్పదిస్తారో చూడాలి.  అలాగే ఈ దీక్ష పై  టీడీపీ ఏ విదంగా రియాక్ట్ అవుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Tags:    

Similar News