బీజేపీ నేతలకు మళ్లీ ఝలక్ ఇచ్చిన పవన్

Update: 2016-12-21 12:13 GMT
పెద్ద నోట్ల ర‌ద్దు - ఇత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో కేంద్రంలోని అధికార‌ బీజేపీ - జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ల మ‌ధ్య మాట‌ల యుద్ధం పెరుగుతోంది. ఇప్ప‌టికే వ‌రుసగా చేసిన ఘాటు ట్వీట్ల నేప‌థ్యంలో ఇరు పార్టీలు మ‌ధ్య గ్యాప్ పెరిగి విమ‌ర్శ‌లు సంధిస్తున్న క్ర‌మంలో ప‌వ‌న్ తాజాగా మ‌రో ట్వీట్ చేశారు. ఐదు అంశాల‌పై ప‌వ‌న్ చేసిన‌ ట్వీట్ల‌పై ఏపీ బీజేపీ ఇంచార్జీ సిద్ధార్థనాథ్ సింగ్  స్పందిస్తూ ప‌వ‌న్ ముందుగా వాస్త‌వ ప‌రిస్థితుల‌ను అధ్య‌య‌నం చేయ‌డం నేర్చుకోవాల‌ని, ప్ర‌జాస్వామ్య‌-పార్ల‌మెంట‌రీ విధానాల‌ను అర్థం చేసుకోవాలని సూచించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై పవన్ ఘాటుగా స్పందించారు. తనకు  ఏపీ బీజేపీ ఇంచార్జీ  సిద్ధార్థనాథ్ సింగ్ సూచనలు ఇవ్వడం బాగానే ఉంది కానీ..అంతటి అనుభవజ్ఞులైన బీజేపీ పెద్దలు చేసింది ఏమిటని తాజా ట్వీట్ లో ప‌వ‌న్ ప్ర‌శ్నించారు.

సుదీర్ఘ రాజ‌కీయ జీవితం - పార్ల‌మెంట‌రీ చ‌ర్య‌ల‌పై అవ‌గాహ‌న ఉన్న‌వారు పెద్ద నోట్ల రద్దు వంటి ఘోర‌మైన త‌ప్పిదాన్ని ఏ విధంగా చేశార‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌శ్నించారు. ఈ నిర్ణ‌యం వ‌ల్ల దేశ‌వ్యాప్తంగా త‌మ‌కేమీ సంబంధం లేన‌ప్ప‌టికీ అనేక‌మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ద‌ని బీజేపీ నాయ‌కుల‌కు క‌నిపించ‌డం లేదా అంటూ ప‌వ‌న్ నిల‌దీశారు. ఒక‌వేళ త‌న‌కు అవ‌గాహ‌న లేద‌నే భావ‌న‌లో ఇప్ప‌టికీ సిద్ధార్థ‌నాథ్ సింగ్ ఉంటే...కేవ‌లం మాట‌ను వివ‌రించిన త‌న‌ది తెలియ‌ని త‌న‌మా లేదంటే... ఇంత‌టి ఇక్క‌ట్ల‌కు కార‌ణ‌మైన బీజేపీ నాయ‌కుల‌దా అనేది ఆలోచించుకోవాల‌ని చుర‌క అంటించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News