ప్రజారాజ్యం.. జనసేన.. పవన్ చెప్పిన తేడా

Update: 2016-04-12 06:35 GMT
ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీలో పవన్ కళ్యాణ్ ఎలా ఉండేవాడో.. ఆ తర్వాత జనసేన పార్టీని ప్రకటించినపుడు ఎలా ఉన్నాడో.. ఇప్పుడెలా ఉంటున్నాడో అందరూ చూస్తున్నారు. ‘యువరాజ్యం’ అధ్యక్షుడిగా ఉన్నపుడు పవన్ లో చాలా ఆవేశం కనిపించేది. చాలా ఉద్రేకంగా మాట్లాడేవాడు. కానీ ‘జనసేన’ ఆవిర్భావ సభకు వచ్చేసరికి చాలా కూల్ గా మాట్లాడాడు. ఆ తర్వాత కూడా ఎప్పుడూ పెద్దగా ఆవేశ పడలేదు. మరి అప్పటికి ఇప్పటికి ఇంత తేడా ఎలా వచ్చింది.. ఇంత పరిణతి ఎలా సాధించారు అని పవన్ ను అడిగితే.. ఆసక్తికర సమాధానం చెప్పాడు.

ప్రజారాజ్యం పార్టీ పెట్టింది తాను కాదని.. తన అన్నయ్య అని.. ఆ పార్టీలో ఉంటూ తాను ఏం మాట్లాడితా అందుకు తన అన్నయ్యదే బాధ్యత అని.. కానీ ‘జనసేన’ విషయంలో ఏం మాట్లాడినా తనదే బాధ్యత కాబట్టి అలా మాట్లాడానని.. అలాగే అనుభవం మీద పరిణతి కూడా వచ్చిందని చెప్పాడు పవన్. ‘జనసేన’ పార్టీ పెట్టాలనుకున్నపుడు తనకు తాను ఎంతో ఆలోచించుకుని.. తనకు తాను కొన్ని పరిమితులు విధించుకుని.. ఆ తర్వాతే ముందడుగు వేశానని పవన్ అన్నాడు.

ఐతే పవన్ చెప్పిన లెక్క తేడాగానే ఉందిక్కడ. ఎంత అన్నయ్య పెట్టిన పార్టీ అయినప్పటికీ.. ఆయనదే బాధ్యత కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడేశాను అనడం కరెక్ట్ కాదు. అప్పటికి పవన్ ఏమీ చిన్న పిల్లాడు కాదు. అతడికి అప్పటికి పరిణతి లేకేమీ కాదు. ఇక్కడ ఫక్తు రాజకీయ నాయకుడిలాగే మాట్లాడాడు పవన్. ఆ పార్టీలో ఉన్నపుడు ఈ పార్టీ నాయకుడిని విమర్శించారే అని అడిగితే.. అది నా వాయిస్ కాదు, ఆ పార్టీ వాయిస్ అంటుంటారు మన నాయకులు. పవన్ వ్యవహారం కూడా ఇలాగే ఉంది మరి.
Tags:    

Similar News