ఆంధ్రోళ్లంటే ఊరుకునేది లేదు

Update: 2015-07-06 17:02 GMT
తనను ఒక మాట అంటే కిందా.. మీదా పీక్కునే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఎదుటోడి వారిని మాత్రం ఉత్తపుణ్యనికే ఇష్టారాజ్యంగా అనేసే తత్వం కాస్త ఎక్కువే. నోరు తెరిస్తే.. ఆంధ్రోళ్లు.. ఆంధ్రోళ్లు అనేస్తూ.. కోట్లాది మంది సీమాంధ్రుల్ని మనసుల్ని గాయపరిచే తెలంగాణ ముఖ్యమంత్రికి పవన్‌ కల్యాణ్‌.. చాలా స్పష్టంగా.. సూటిగా హితవు పలికే ప్రయత్నం చేశారు.

తాను చెప్పాల్సిన మాటను  చెప్పే ముందు.. ఆంధ్రోళ్లు.. ఆంధ్రోళ్లు అనే మాటను తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌ రావు తరచూ అంటారని చెబుతూ.. ఆయన్ను మాత్రం దొరలు అని అంటే బాగా ఫీల్‌ అవుతారని చెప్పిన చంద్రబాబు.. అలా అనటాన్ని తప్పు  పట్టటమే కాదు.. ఆంధ్రోళ్లు అనే మాట కూడా సరికాదని చెప్పకొచ్చారు.

ఎందుకంటే.. ఆంధ్రోళ్లు అంటే.. చంద్రబాబుసామాజిక వర్గమైన కమ్మలు మాత్రమే కాదని.. టీఆర్‌ఎస్‌కు ఇష్టమైన కాపులు.. మాలలు.. మాదిగలు..ఇలా ఎన్నో కులాలు.. మతాలు ఉంటారని చెప్పుకొచ్చారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీని తిట్టాలనిపిస్తే తెలుగుదేశం పార్టీని తిట్టాలని.. కాదు.. చంద్రబాబును తిట్టాలంటే ఆయన పేరునుప్రస్తావిస్తూ సూటిగా తిట్టేయాలి కానీ.. ఇలా ఆంధ్రోళ్లు అన్న మాటను ఉపయోగించటం సరికాదని చెప్పేశారు. ఆంధ్రోళ్లు అంటే ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే లేదని.. చాలానే పార్టీలు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.

ఆంధ్రోళ్లు అని తిట్టేసిన ప్రతిసారీ కోట్లాది మంది ఆంధ్రోళ్ల మనసు ఎంతగానో నొచ్చుకుంటుందని చెప్పిన పవన్‌కల్యాణ్‌.. సున్నితమైన విషయాన్ని అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు. తమను దొరలు అన్నప్పుడు ఇష్టపడని టీఆర్‌ఎస్‌ నేతలు.. చంద్రబాబును తిట్టాల్సింది పోయి.. ఆంధ్రోళ్లు అని తిట్టటంలో అర్థం ఏముందన్న సూటి ప్రశ్నను వేసేశారు. మరి.. పవన్‌ మాటలకు కేసీఆర్‌ అండ్‌ కో ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News