మళ్లీ ట్వీట్ కూత పెట్టిన పవన్..

Update: 2016-12-19 16:04 GMT
దేశంలోని చాలామంది రాజకీయ నేతలు ఉన్నప్పటికీ.. సోషల్ మీడియా ట్విట్టర్ ను అస్త్రంగా చేసుకొని రాజకీయ ప్రత్యర్థులపై దునుమాడేసిన తీరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ట్వీట్ల కూత పెట్టి తాను చెప్పాలనుకుంటున్న విషయానికిసంబంధించిన వివరాల్ని ముందస్తుగా ప్రకటించటం లాంటివి ఈ మధ్యన పవన్ చేస్తున్నారు.

ఐదారు రోజుల క్రితం ట్వీట్లు చేసి.. తాను కొన్ని అంశాల మీద సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తానన్న ఆయన.. అందుకు తగ్గట్లే ట్వీట్లు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా హామీని ఇచ్చిన బీజేపీ నేతలకు తన ట్వీట్లతో చురుకు పుట్టించిన పవన్.. రేపు (మంగళవారం) ఏ అంశం మీద ట్వీట్లు చేసే విషయాన్ని తాజాగా వెల్లడించాడు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో పాటు.. బంగారం మీద కేంద్రం పరిమితులు పెడుతున్నట్లుగా వస్తున్న వార్తల నేపథ్యంలో ఆ అంశాల మీద తన అభిప్రాయాల్ని పోస్ట్ చేస్తానని పవన్ వెల్లడించారు.

అంశాల వారీగా హాట్ హాట్ ట్వీట్లు చేసి రాజకీయంగా వేడి పుట్టిస్తున్న పవన్.. తాను చెప్పిన అంశాలకు సంబంధించి రేపటి ట్వీట్లతో ఈ ప్రక్రియకు ముగింపు పలకనున్నారని చెప్పాలి. ఇప్పటికే తన ట్వీట్ల కూతతో కమలనాథులకు పంచ్ ల మీద పంచ్ లు వేసిన పవన్.. రేపటి ట్వీట్లతో మరెన్ని పంచ్ లు వేస్తారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Tags:    

Similar News