రాబోయే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి బరిలోకి దిగేది జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. జనసేన కోసం స్పీకర్లు, కంటెంట్ రైటర్లు, అనలిస్టులుగా సేవలు అందించడానికి అనంతపురం జిల్లా నుంచి వచ్చిన నూతన నాయకులను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని జనసేన పార్టీ పరిపాలన కార్యాలయంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేయనున్నట్లుగా ప్రకటించారని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.
అనంతపురం నుంచి సుమారు 150 మంది ప్రతినిధులకు పైగా పాల్గొన్న ఈ సమావేశంలో వచ్చిన ప్రతిఒక్కరిని పేరు పేరున పలకరించిన పవన్ కళ్యాణ్ ఉద్వేగభరితంగా వారు చేసిన ప్రసంగాలను విన్నారని జనసేన ప్రకటన విడుదల చేసింది. అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఆయా ప్రాంతాలలోని సమస్యల గురించి వివరించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన తుది శ్వాసవరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. తనను కొందరు పూర్తిస్థాయి రాజకీయనాయకుడ్ని కానని విమర్పిస్తున్నారని, అసలు పూర్తిస్థాయి రాజకీయనాయకులు ఎవరున్నారో తెలియచేయాలని పవన్ ప్రశ్నించారు. ఒక్కో నాయకుడు వేలాది కోట్లరూపాయల ఆదాయాన్ని రాజకీయాల్లో ఆర్ధించి ఇంట్లో కూర్చున్నారని, వారు ఇంట్లో కూర్చుని కోట్లాది రూపాయల ఆదాయం వచ్చేవిధంగా ఏర్పాట్లు చేసుకున్నారని పవన్ ఆక్షేపించారు. అయితే తాను మాత్రం తన కుటుంబం కోసం, తన మీద ఆధారపడిన తన సిబ్బంది కోసం మాత్రమే సినిమాలలో నటిస్తున్నట్లు పవన్ వివరించారు.
తనకు సినిమాలన్నా, సినీ పరిశ్రమ అన్న అపారమైన గౌరవం ఉందని, అయితే ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే సినిమాలలో నటించడం వాయిదా వేసుకుంటానని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ప్రకటించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తాను అనంతపురం జిల్లా నుంచి పోటీచేయడం ఖాయమని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇటీవల అనంతపురంలో మూడు రోజులపాటు జరిగిన జనసేన శిబిరంలో పాల్గొన్న వారినందరిని కలవడానికి కొద్ది రోజుల్లో అనంతపురం వస్తానని తెలిపారు. త్వరలోనే జిల్లాలో పాదయాత్ర చేస్తానని పవన్ కళ్యాణ్ వెల్లడించారని జనసేన ప్రకటన వెలువరించింది.