బాబుతో ప‌వ‌న్ భేటీ

Update: 2015-11-11 12:10 GMT
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబునాయుడితో భేటీ కానున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్‌ చంద్రబాబునాయుడు అప్పాయింట్ మెంట్ కోరారు. పవన్ తో రేపు భేటీ అయ్యేందుకు చంద్రబాబు అంగీకరించారు. భూ నిర్వాసితులకు నష్టపరిహారం, భూ సేకరణ తదితర అంశాలపై వీరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

విజయవాడలో రేపు జ‌రిగే ఈ భేటీపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. భూసేక‌ర‌ణ విష‌యంలో గ‌తంలో చంద్ర‌బాబు అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. భూసేక‌ర‌ణ‌కు ప‌వ‌న్ అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డ‌మే కాదు...అవ‌స‌ర‌మైతే దీక్ష చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. తాజాగా కొద్దిరోజుల క్రితం భూ సేక‌ర‌ణ‌కు ఏపీ ప్ర‌భుత్వం జీవో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్- చంద్ర‌బాబుల భేటీ ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News