ఏపీకి 3 రాజధానులు ఏర్పాటు చేస్తూ సీఎం జగన్ అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడంతో ఈ వార్ ముదిరింది. ప్రతిపక్ష చంద్రబాబు అసెంబ్లీలో ఇంటా బయటా పోరాడుతుండగా.. జనసేనాని పవన్ తాజాగా ఈ పోరాటాన్ని కొత్త పుంతలు తొక్కించారు ఛలో ఢిల్లీ ప్లాన్ చేశారు. ఢిల్లీకి వెళ్లి బీజేపీ తో కలిసి జగన్ ను నిలువరించే ప్లాన్ చేశారు.
ఇప్పటికే ఏపీలో బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ విషయంలో సీఎం జగన్ మెడలు వంచడానికి కేంద్రంలోని బీజేపీ పెద్దల సాయం కోరడానికి ఢిల్లీ బాట పట్టారు.
తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్, మరో నేత నాదెండ్ల మనోహర్ తో కలిసి రేపు ఢిల్లీకి వెళుతున్నారు. సాయంత్రం కేంద్రంలోని బీజేపీ పెద్దలను కలిసి అమరావతిపై భవిష్యత్ రాజకీయ ప్రణాళికలను వెల్లడిస్తారని జనసేన వర్గాలు తెలిపాయి.
అమరావతిపై చివరి వరకూ పోరాడుతానని పవన్ స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్రం సాయం కోరుతామని.. జగన్ సర్కారు పై కేంద్రంతోనే ఒత్తిడి తెస్తామని మంగళవారం ప్రకటించారు. దీంతో పవన్ ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది. కేంద్రంలోని బీజేపీ అమరావతిపై పవన్ కోరికపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.