హోదా పోరాటం గురించి రాష్ట్రంలో సాధారణ కూలీని అడిగినా... బడికెళ్లే పిల్లాడిని అడిగినా జగన్ పేరే వారి నోటి నుంచి వస్తుంది. గత ఎన్నికలు మొదలు జగన్ ప్రత్యేక హోదా డిమాండ్ చేయని రోజే లేదు. అయితే - నాలుగేళ్ల కాపురం అనంతరం టీడీపీతో తెగతెంపులు చేసుకున్న పవన్ కళ్యాణ్ జనంలో క్రేజ్ కోసం తాను కూడా ప్రత్యేక హోదా ఊపిరినే పీలుస్తున్నాడు. ఆ డిమాండ్ పై గట్టిగా ఉంటే పర్లేదు. అసలు ఆ డిమాండ్ చేసిందే నేను అంటూ పదే పదే తన పోరాట యాత్రలో చెబుతున్నాడు.
ఈ నాలుగేళ్ల పేపర్లన్నీ తిరగేసినా జనసేన పేరిట ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఒక్క ప్రకటన కనపడదు. పవన్ ఆన్‌లైన్ అక్కౌంట్లన్నీ వెతికితే కొన్ని చోట్ల కనిపిస్తుంది. ఆ డేట్లు చూస్తే అర్థమవుతుంది జగన్ ప్రత్యేక హోదా డిమాండ్ పై జనంలో సెంటిమెంట్ పెరుగుతున్న తరుణంలో ఒకట్రెండు సార్లు ప్రత్యేక హోదాను ఉటంకించాడు. అయితే, ఈరోజు మాత్రం మొదట ప్రత్యేక హోదా అడిగిందే మేం అంటూ ప్రచారం చేస్తున్నాడు జనసేనాని. ఆ డిమాండ్ పై అలుపెరగకుండా నిలబడటం వల్ల జగన్ గ్రాఫ్ ఎంత ఫాస్ట్ గా పెరిగిందో బాబు యు టర్న్ తీసుకోవడమే దానికి సాక్ష్యం.
పవన్ మరో షాక్ కూడా ఇచ్చాడండోయ్... నిరుద్యోగ భృతి జనసేనకు యువతలో పెరుగుతున్న మద్దతు చూసి టీడీపీ ప్రవేశపెట్టిందట. మరి పవన్ అడిగినా ఉద్దానం పట్టించుకోని బాబు పవన్ అడక్కుండానే భృతిని ఎలా పెట్టాడో కూడా చెబితే బాగుంటుంది. అసలు విషయం ఏంటంటే... ఇటీవల తన పాదయాత్రలో జగన్ బాబు ఇచ్చిన హామీలు -చేసిన మోసాలు అని ఒక్కోటీ జనాల్లో మారుమోగేలా పూసగుచ్చినట్టు వివరిస్తున్నారు. వీటిలో నిరుద్యోగ భృతి బాగా వైరల్ అయింది. దీంతో చంద్రబాబు టీం పదే పదే మీడియా ముందుకు వచ్చి మేం 98 శాతం హామీలు నెరవేర్చాం అని చెబుతున్నారు. వైసీపీ సాధించిన నిరుద్యోగ భృతి మంజూరు విజయాన్ని కూడా జనసేన తన అక్కౌంట్లో వేసేసుకుంది.
తాజాగా ఇంకో విషయాన్ని కూడా పవన్ వైఎస్ జగన్ ను ఫాలో అయ్యారు. చెరుకు రసం కలర్ లోఉన్న మంచినీళ్లను చూపిస్తూ *చంద్రబాబూ ఇది చెరుకు రసం కాదు - మీ ప్రభుత్వం జనాలకు ఇస్తున్న మంచినీళ్లు* అంటూ బాటిల్ చూపిస్తూ జగన్ చేసిన ప్రసంగం ఇటీవల ఏపీ సర్కారు గాలి తీసింది. జగన్ ఆ ప్రసంగం బాగా హిట్టవడంతో అదే సీన్ జనసేన పోరాట యాత్రలో రిపీట్ అయ్యింది.
ఇలా ఒకటేమిటి... ఏపీలో జగన్ లేవనెత్తే సమస్యల్లో స్పందన వచ్చే ప్రతి విషయాన్ని జనసేన వాళ్లు శ్రద్ధగా గమనిస్తూ ఎంచక్కా కాపీ కొట్టేస్తున్నారు. కాపీ కొట్టిన వాడు కొట్టినట్లు ఊరుకుండాలి కదా... పైగా కబ్జాచేసిన వాడే ఓనరు మీద కోర్టుకు వెళితే ఎలా ఉంటుందో పవన్ పద్ధతి కూడా అలాగే ఉంటోంది. జగన్ ప్లాన్స్ అన్నీ ఫాలో అవుతూ అవి నా ప్లాన్లే అని తన ఖాతాలో వేసుకునేందుకు విఫలయత్నం చేస్తున్నారు. జనానికి మతిమరుపు ఉండొచ్చు గాని మరీ ఇంత మతిమరుపు ఉండదు పవన్ ... మీరు గుర్తించాలి. !