పొత్తుల‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన ప‌వ‌న్‌ ట్వీట్‌

Update: 2019-01-03 08:32 GMT
ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు సంబంధించి చాలానే వార్త‌లు ప్ర‌చారంలోకి వ‌స్తున్నాయి. తెలంగాణ ఎన్నిక‌ల్లో స‌మ‌యం త‌క్కువ‌గా ఉండ‌టం.. పార్టీ నిర్మాణానికి స‌మ‌యం ఇవ్వ‌కుండా కేసీఆర్ ఎన్నిక‌లకు వెళ్లిపోయిన నేప‌థ్యంలో తాను పోటీ చేయ‌లేద‌న్న మాట చెప్ప‌టం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ప్ర‌త్య‌క్షంగా ఎలాంటి పాత్ర పోషించ‌న‌ప్ప‌టికీ.. చేయాల్సిన ప‌ని లోగుట్టుగా చేసిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇదిలా ఉంటే.. ఏపీలో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ స్టాండ్ ఎలా ఉంటుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. దీనికి త‌గ్గ‌ట్లే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న పార్టీ వ‌ర్గాల‌కు సూచ‌న‌లు చేస్తూ.. ప‌వ‌న్ ను తొంద‌ర‌ప‌డి విమ‌ర్శ‌లు చేయొద్ద‌ని.. దూకుడుగా వ్య‌వ‌హ‌రించొద్ద‌న్న‌మాట చెప్పిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు.. జ‌న‌సేన‌తో పొత్తు మాట గురించి మీడి ప్ర‌తినిధులు ఏపీ సీఎం ను ప్ర‌శ్నించిన‌ప్పుడు ఆయ‌న న‌వ్వులో క‌నిపించిన భావాలు ప‌లువురికి కొత్త క‌న్ఫ్యూజ్ అయ్యేలా చేశాయి.

అదే స‌మ‌యంలో జ‌గ‌న్ పార్టీతో ప‌వ‌న్ పొత్తు పెట్టుకునే అవ‌కాశం ఉంద‌న్న అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. ఇలాంటి వాటి నేప‌థ్యంలో జ‌న‌సేన తాజాగా ఒక ట్వీట్ చేసింది. త‌మ పార్టీ ఒంట‌రిగా ఏపీలోని 175 స్థానాల్లో పోటీ చేయించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. వామ‌ప‌క్షాలు మిన‌హా మ‌రెవ‌రితోనూ వెళ్ల‌నన్న మాట‌ను కుండ‌బ‌ద్ధ‌లు కొట్టేశారు. ఏపీలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాలకు సంబంధించి యువ‌త‌.. మ‌హిళ‌ల‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇవ్వ‌నున్న‌ట్లుగా పేర్కొన్న‌రు. పొత్తు విష‌యంలో అధికార‌.. విప‌క్షాల మాట అస్స‌లు వినేది లేద‌న్న స్ప‌ష్ట‌త ఇచ్చిన ఆయ‌న‌.. క‌మ్యునిస్టుల‌తో క‌లిసి జ‌న‌సేన ఎన్నిక‌ల‌కు వెళ్ల‌నున్న‌ట్లుగా చెప్పారు.


Full View

Tags:    

Similar News