ప‌వ‌న్ హెచ్చ‌రిక‌లు విన్నారా?

Update: 2016-10-15 13:26 GMT
కాకినాడ స‌భ నిర్వ‌హించిన త‌ర్వాత తాజాగా హైద‌రాబాద్‌ లో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఘాటు హెచ్చ‌రిక‌లు చేశారు. ప‌శ్చిమ‌బెంగాల్‌ లో స‌ర్కారుకు వ్య‌తిరేకంగా వామ‌ప‌క్షాలు సాగించిన పోరాటంతో ర‌క్త‌పాతం పారిన నందిగ్రామ్‌ ఉదంతాన్ని ప్ర‌స్తావించి ప‌వ‌న్  బీమ‌వరం లోనూ అదే సీన్ రిపీట్ అవుతుంద‌ని హెచ్చ‌రించారు. అంతేకాకుండా ఏపీ స‌ర్కారు తీరును త‌ప్పుప‌ట్టారు. త‌న పార్టీ నిర్మాణం కొన‌సాగుతున్న తీరును సైతం ప‌వ‌న్ ఈ సంద‌ర్భంగా వివ‌రించారు.

పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చి తనను కలిసిన రైతులతో కలిసి ప‌వ‌న్ క‌ళ్యాణ్ హైద‌రాబాద్‌ లో విలేకరులతో మాట్లాడారు. భీమవరంలో స్థాపించనున్న గోదావరి మెగా ఆక్వాఫుడ్స్‌ సమస్య మరొక నందిగ్రామ్‌ గా మారేలా తయారైందని అన్నారు. పంటలకు అనువుగాని భూములలో స్థాపించాల్సిన పరిశ్రమలను అన్నంపెట్టే గోదావరి జిల్లాలలో స్థాపించడం ఎంత వరకూ సమంజసమని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అక్కడ ప‌ర్యావ‌ర‌ణ నిబంధ‌న‌ల‌ను పాటించలేదని, పరిశ్రమ పెట్టడానికి పంటలు పండని భూమి తీసుకోవాల‌నే నియ‌మాన్ని కూడా పాటించలేదని ఆయన అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలు మనకు అన్నం పెట్టే జిల్లాలని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ఇటువంటి జిల్లాల్లో నదులను కలుషితం చేసే ఫ్యాక్టరీలు పెట్టడం సరి కాదని ఆయన అన్నారు. రెండున్నరేళ్లుగా అక్కడి ప్రజలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో తనకు అర్థం కావడం లేద‌న్నారు. న‌దులను కలుషితం చేసే పరిశ్రమల స్థాపన సరికాదని ప‌వ‌న్ త‌ప్పుప‌ట్టారు. అక్వా ఫుడ్ కోర్టు వద్దని రైతులు ముక్తకంఠంతో కోరుతున్నా పాలకులు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్ధం కావడం లేదన్నారు.

ఈ సంద‌ర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప‌వ‌న్ స్పందించారు.  స్పెష‌ల్ స్టేట‌స్‌ పై జనసేన ఉద్యమం ఆగిపోలేదని  పవన్ కల్యాణ్ స్ప‌ష్టం చేశారు. జనసేన పార్టీ నిర్మాణం కనిపించకపోయినా అడ్మినిస్ట్రేషన్ వర్క్ చురుకుగా సాగుతున్నదని చెప్పారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై తాము త‌ప్ప‌కుండా స్పందిస్తుంటామ‌ని ప‌వ‌న్ పున‌రుద్ఘాటించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News