ఒకరికి తెలీకుండా మరొకరు.. ఇలా మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ అనే ప్రబుద్ధుడి ఇంటి ఎదుట అతడి ఇద్దరు భార్యలు కలిసి నిరసన చేసిన వైనం సంచలనంగా మారింది. ఇతగాడి వైనం తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. నిజామాబాద్ లోని రాజీవ్ నగర్ లో నివాసం ఉండే పవన్ మహా మాయగాడు. ఒకరికి తెలీకుండా ఒకరిని పెళ్లి చేసుకోవటంలో అతడి ప్లానింగే వేరుగా ఉంటుంది.
మహారాష్ట్రకు చెందిన ఐలాబాయిని తొలుత పెళ్లి చేసుకొని కొంతకాలం ఆమెతో కాపురం చేశాడు. అనంతరం కర్ణాటకకు చెందిన దీప అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం కాపురం చేయటం.. తర్వాత జంప్ అయిన అతడు తాజాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
ప్రతి పెళ్లి సందర్భంలోనూ రూ.10లక్షలు కట్నం తీసుకుంటూ.. ప్రతి పెళ్లికి సంబంధం లేకుండా రాష్ట్రాన్ని మార్చేసే పవన్ మోసాన్ని మొదటి ఇద్దరు భార్యలు గుర్తించారు. తాజాగా నిజామాబాద్ లోని అతడి ఇంటి ముందు నిరసన చేపట్టారు. పెళ్లిళ్లు చేసుకొని మోసాలకు పాల్పడుతున్న పవన్ ను కఠినంగా శిక్షించి..తమకు న్యాయం చేయాలంటూ నిరసన చేపట్టటం సంచలనంగా మారింది. ప్రస్తుతం పరారీలో ఉన్న పవన్.. తన మూడో భార్యతో ఆంధ్రప్రదేశ్ లో కాపురం పెట్టినట్లుగా చెబుతున్నారు. పవన్ ఇంటి ముందు నిరసనకు దిగిన ఇద్దరు భార్యలు.. పోలీసులకు మాత్రం ఫిర్యాదు చేయలేదని చెబుతున్నారు. మరి.. పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటున్న పవన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుంటారో లేదో?