మునికోటి గుర్తున్నాడా..? గత ఏడాది ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతూ తిరుపతిలో ప్రాణ త్యాగం చేసిన సామాన్యుడు. అతను చనిపోయినపుడు చాలా గొంతులు లేచాయి. రాజకీయ పార్టీలు హడావుడి చేశాయి. తిరుపతి అతడి పేరు చెప్పి చాలా కార్యక్రమాలు చేశారు. ఆందోళనలు చేశారు. ఐతే కొన్ని రోజులు గడిచాక అంతా మామూలైపోయింది. అతడి సంగతి అంతా మరిచిపోయారు. అతడి కుటుంబాన్ని పట్టించుకున్న నాథుడు లేడు. ఈ రోజు అతడి వర్ధంతి సందర్భంగా తిరుపతి నాయకులు ఏం చేస్తున్నారో ఏంటో కానీ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం మునికోటి కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకొచ్చాడు.
పవన్ పార్టీ జనసేన తరఫున ఒక టీం హైదరాబాద్ నుంచి ఒక టీం తిరుపతికి వచ్చింది. ఆ టీం మునికోటికి నివాళి అర్పించడంతో పాటు రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అతడి కుటుంబానికి అందజేసింది. ఎవరైనా గుర్తు చేశారా.. పవనే గుర్తుపెట్టుకున్నాడా తెలియదు కానీ.. పవన్ చేసిన పని మాత్రం ప్రశంసలందుకుంటోంది. ఈ సందర్భంగా మునికోటి సోదరుడు పవన్ ను కొనియాడుతూ.. తెలుగుదేశం-కాంగ్రెస్ పార్టీల్ని విమర్శించాడు. తన అన్నయ్య మరణించినపుడు తెలుగుదేశం రూ.5 లక్షలు.. కాంగ్రెస్ పార్టీ రూ.2 లక్షలు సాయం ప్రకటించాయని.. కానీ ఇప్పటిదాకా తమకు నయా పైసా అందలేదని అతనన్నాడు. మరి ఇప్పటికైనా మిగతా పార్టీలు మునికోటి కుటుంబానికి సాయం అందించే విషయంలో స్పందిస్తాయేమో చూద్దాం.