రాబోయే ఎన్నికల్లో జనసేన ఎన్ని నియోజకవర్గాల్లో పోటీచేయబోతోంది ? అనేది పెద్ద పజిల్ అయిపోయింది. అలాంటి పజిల్ కు వారాహియాత్రలో అధినేత పవన్ కల్యాణ్ తానే సమాధానం చెప్పినట్లున్నారు. నరసాపురంలో పార్టీ నేతల సమావేశంలో మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో జనసేన 35 నియోజకవర్గాల్లో తగ్గకుండా గెలవాలని సూచించారు.
ఇందుకోసం నేతలు, వీరమహిళలు, కార్యకర్తతంతా కష్టపడి పనిచేయాలన్నారు. 35 నియోజకవర్గాల్లో తగ్గకుండా గెలవాలని అన్నారే కానీ ఎన్నిసీట్లలో పోటీచేయబోతోందనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.
పవన్ మాటలను బట్టిచూస్తే 35 సీట్లకన్నా ఎక్కువ నియోజకవర్గాల్లోనే పోటీచేయబోతోందని అనుకుంటున్నారు. ఎందుకంటే గెలుపే 35 నియోజకవర్గాలకు తగ్గకూడదంటే అంతకుమించే పోటీచేయాల్సుంటుంది కదా.
ఎందుకంటే ఏ పార్టీకూడా పోటీచేసిన అన్నీ స్ధానాల్లోను గెలిచే అవకాశాలు ఉండదన్నది అందరికీ తెలిసిందే. కాబట్టి పవన్ తాజా ఆదేశాల ప్రకారం అంచనా వేస్తే కనీసం 50 నియోజకవర్గాలకు తగ్గకుండా పోటీచేయాలని అనుకుంటున్నట్లు అనుమానంగా ఉంది.
రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంతో తాను గ్రామాల్లోకి చొచ్చుకుపోతున్నట్లు చెప్పారు. నేతలు, క్యాడర్ కూడా సమస్యల మూలాల్లోకి వెళ్ళి పనిచేయాలన్నారు. జనాల్లోకి వెళ్ళినపుడే నేతలకు ఆదరణ లభిస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్యరంగాలను పూర్తిగా గాలికొదిలేసినట్లు చెప్పారు. ఏ ఒక్క వర్గమూ వైసీపీ ప్రభుత్వంలో సంతృప్తితో లేదని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు నేతలంతా కలిసికట్టుగ పనిచేయాలన్నారు. పార్టీ నేతలు చేసే కష్టమీదే జనాలు పార్టీని నమ్మటం ఆదారపడుంటుందన్నారు.
టికెట్ ఎవరికి దక్కిందన్నది కాకుండా పార్టీ గెలుపే టార్గెట్ గా అందరు కలసికట్టుగా పనిచేయాలని స్పష్టంగా ప్రకటించారు. సమస్యల్లోనే పరిష్కారాలు కూడా ఉంటాయన్న విషయాన్ని నేతలు మరచిపోకూడదని చెప్పారు. కాబట్టి సమస్యల పరిష్కారంపై నేతలు, వీరమహిళలు రెగ్యులర్ గా జనాల్లోకి చొచ్చుకుని వెళ్ళాలన్నారు.
ప్రభుత్వం పై ఒత్తిడితెచ్చి సమస్యల పరిష్కారం జరిగేట్లుగా కష్టపడాలని చెప్పారు. పార్టీ నేతలు ఎంతగా కష్టపడితే ఫలితం అంత ఎక్కువగా ఉంటుందని పవన్ నిర్దేశించారు. తన వారాహియాత్రతో జనాల్లో మంచి స్పందన వచ్చిందన్న విషయాన్ని పవన్ ప్రస్తావించారు.