అభిమానుల మధ్య వాగ్వాదాలు వివాదాలు ఒకప్పుడు బాహాబాహీగా సాగేవి. గోడ పోస్టర్ రోజుల్లో.. క్యూలైన్ లో టికెట్లు కొనుక్కునే రోజుల్లో అభిమానుల మధ్య ఘర్షణలు కొట్లాటలు చూసేవాళ్లం. కానీ ఇప్పుడు డిజిటల్ యుగంలో వాట్సాప్ యుద్ధాలు.. సోషల్ మీడియా వార్ గా రూపాంతరం చెందాయి. ఎవరు ఎవరినైనా సులువుగా తిట్టుకునేందుకు ఇవి సరసమైన వేదికలు. అవసరమైతే ప్రత్యర్థి హీరోని చంపేంత కసిని ఇక్కడ ప్రదర్శించగలరు.
అటువైపు హీరోని పొడిచేస్తాం అని భయపెట్టేంతగా ఫ్యానిజం పరాకాష్టకు చేరిపోయింది. మారిన ట్రెండ్ లో ప్రజల్లో ఎంత ఎడ్యుకేషన్ పెరిగినా కానీ దాంతో పాటు పైత్యం కూడా అంతే ముదురుతోందే కానీ తగ్గడం లేదనేది ఒక సర్వే నివేదన. ఇప్పుడు ఆన్ లైన్- సోషల్ మీడియా వార్ కాస్తా నేరుగా పబ్లిగ్గా హత్య చేయడం వరకూ దారి తీసిన ఘటన ప్రజలను నిశ్చేష్ఠులను చేసింది. ఏకంగా పీకే ఫ్యాన్ ని ప్రభాస్ ఫ్యాన్ పబ్లిగ్గా కొట్టి హతమార్చడం సంచలనమైంది.
ఆన్ లైన్ లో కించపరచడాలు అవమానకరంగా ఒకరిపై ఒకరు దెప్పి పొడుచుకోవడాలు తిట్టుకోవడాలు ఇవన్నీ ఒక కోణం అనుకుంటే ఇప్పుడు పబ్లిగ్గా జరిగిన ఒక ఘర్షణలో ఒక హీరో అభిమాని ఇంకో హీరో అభిమానిని నేరుగా తలపై మోది చంపేయడం ప్రత్యక్ష సాక్ష్యులను షాక్ కి గురి చేసింది.
నిజానికి ఇది చినికి చినికి గాలివానగా మారిన ఒక సోషల్ మీడియా ఫైట్. ఇద్దరు అభిమానుల మధ్య మాటల యుద్ధం పెరిగి పెద్దదై చివరికి హత్యకు దారితీసింది. హరి కుమార్- కిషోర్ అనే ఇద్దరు కూలీలు ఏలూరు నుంచి అత్తిలికి వచ్చారు. ఇంటికి రంగులు వేసే పనికి కుదిరారు. అయితే అక్కడ పని పూర్తి చేసుకుని మరుసటి రోజు ఉదయం బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఇంతలోనే కార్మికుల మధ్య చిన్నగా ఫ్యాన్ వార్ స్టార్టయింది. నువ్వు పవన్ కల్యాణ్ అభిమానివి అని ఒకరు గొడవ స్టార్ట్ చేయగా నువ్వు ప్రభాస్ ఫ్యాన్ వి.. ఇది కుదరదు! అంటూ ఇద్దరి మధ్యా గొడవ చినికి చినికి గాలి వానైంది.
కిషోర్ కు పవన్ కళ్యాణ్ హోదా(సోషల్ మీడియా ల్లో) ఉందని హరి కుమార్ దానిని తొలగించాలని పట్టుబట్టాడు. ప్రభాస్ ఫోటోలు వీడియోలతో కిషోర్ స్టేటస్ ని హరి అప్ డేట్ చేయాలనుకున్నాడు. అయితే కిషోర్ నిరాకరించడంతో క్షణికావేశంతో హరికుమార్ సెంట్రింగ్ పైపుతో తలపైన ముఖంపైనా మోదాడు.
ఘటన అనంతరం హరికుమార్ అక్కడి నుంచి పరారీలో ఉండడంతో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనలో కిషోర్ మృతి చెందాడు. ఆ ఇద్దరి మధ్యా సోషల్ మీడియా స్టాటస్ ల గురించి తమ ఫేవరెట్ స్టార్ల గురించి మొదలైన ఘర్షణ ఇప్పుడు పబ్లిక్ గా హత్యకు దారి తీయడానికి పురికొల్పింది. ఇది క్షణికావేశంలో హత్యోదంతం.
సంయమనం పాటించాలి:
యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. రామ్ చరణ్ లేదా మహేష్ .. పవన్ కల్యాణ్ లాంటి సీనియర్ హీరోలు కానీ తమ అభిమానులు సంయమనంతో ఉండాలనే కోరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి తొలి నుంచి అభిమానులను సేవా మార్గంలోకి మరల్చి మంచి పనులు చేసేందుకు పురి కొల్పారు. ప్రభాస్ సహా ఎవరూ అభిమానుల మధ్య గొడవలను ఆహ్వానించరు. సాధ్యమైనంత వరకూ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని కోరుతున్నారు.
కానీ అభిమానుల పిచ్చి పరాకాష్టకు చేరుకుని ఒక్కోసారి గొడవలకు దారి తీస్తోంది. దాంతో దారుణమైన ఘటనల్ని చూడాల్సి వస్తోంది. హీరోల అభిమానుల్లో ఫ్యానిజం పిచ్చిగా మారకూడదు. సంయమనంతో వాస్తవంలో జీవించాలని కూడా ఇప్పుడు ఈ ఘటన గురించి తెలుసుకున్న నెటిజనులు సూచిస్తున్నారు.