పొత్తులు ఎప్పుడు ప్రకటిస్తారు ?

Update: 2023-04-30 10:03 GMT
మాటలంతా అయిపోయింది ఇక ముహూర్తం పెట్టుకోవటం మాత్రమే మిగిలింది అన్నట్లుగా అయిపోయింది టీడీపీ-జనసేన వ్యవహారం. పొత్తులు పెట్టుకోవటం ఖాయమైపోయింది. ఎన్ని నియోజకవర్గాలు, ఏ నియోజకవర్గాలో కూడా ఈపాటికే ఫైనల్ అయిపోయుంటుంది. కాకపోతే మిగిలింది ఏమిటంటే ఆ పొత్తులను, సీట్లతో పాటు సంఖ్యను ప్రకటింటమే. మరా అధికారిక ప్రకటనకు అడ్డంకి ఏమిటంటే బీజేపీ. బీజేపీతో పొత్తును జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెంచేసుకుంటే వెంటనే టీడీపీతో పొత్తును ప్రకటించేస్తారు.

గ్రౌండ్ లెవల్లో జరుగుతన్నదాన్ని బట్టిచూస్తే బీజేపీతో కలిసుండటం పవన్ కు ఏమాత్రం ఇష్టంలేదనిర అర్ధమైపోతోంది. బీజేపీ గనుక టీడీపీతో పొత్తుకు రెడీయితే పవన్ హ్యాపీయే. మూడు పార్టీలు కలిసి పోటీచేయటానికి పవన్ కు ఎలాంటి అభ్యంతరాలుండదు. కానీ అందుకు బీజేపీ అంగీకరించటంలేదు. చంద్రబాబునాయుడుతో చేతులు కలపటానికి కమలంపార్టీ అగ్రనేతలు ఏమాత్రం ఇష్టపడటంలేదు. అందుకనే బీజేపీతో ప్రయాణించటానికి పవన్ ఇష్టపడటంలేదు.

రాబోయే ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్ళేందుకు పవన్ మానసికంగా సిద్ధమైపోయారు. కాకపోతే బీజేపీ పొత్తును తెంచేసుకోవటమే కష్టంగా ఉంది. పొత్తును తెంచుకోవటం అనుకున్నంత ఈజీకాదు పవన్ కు. ఈ నేపధ్యంలోనే ఏమిచేయాలో అర్ధంకాకే చంద్రబాబుతో భేటీ అయినట్లుంది. వీళ్ళద్దరి ఇప్పటికే మూడుసార్లు సమావేశమై చాలా విషయాలే మాట్లాడుకున్నారు. కానీ ఏమి మాట్లాడుకున్నా, ఎన్ని మాట్లాడుకున్నా ఎలాంటి ఉపయోగముండదు. ముందు బీజేపీ విషయాన్ని ఫైనల్ చేయకపోతే ఉపయోగముండదు.

ఇదే సమయంలో బీజేపీ, జనసేన మధ్య వ్యవహారం ఎలాగుందంటే ముందుగా పొత్తు వద్దని ఎవరు ప్రకటించాలా అని ఎవరికి వాళ్ళుగా ఎదురుచూస్తున్నట్లుంది. అప్పుడు ఏమవుతుందంటే పొత్తులో నుండి బయటకు వచ్చిన పార్టీని రెండోపార్టీ అన్నీరకాలుగా తప్పు పట్టవచ్చు. ఆ అవకాశం కోసమే జనసేన, బీజేపీలు వెయిట్ చేస్తున్నాయి. మరా ముహూర్తం ఎప్పుడు వస్తుందో ఏమో చూడాల్సిందే. ఎందుకంటే ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఏపీలో కన్నా తెలంగాణాలో ముందుగా ఎన్నికలు జరుగుతాయి. దీని ప్రభావం తర్వాత జరగబోయే ఏపీ ఎన్నికల మీద కూడా పడుతుంది. మరి టీడీపీ, జనసేన పొత్తును అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

Similar News