ప‌వ‌న్ పై విమ‌ర్శ‌లు స‌రే బాధితుల క‌థేంటి?

Update: 2022-04-15 12:30 GMT
రాజ‌కీయాల్లో ఒక‌రినొక‌రు విమ‌ర్శించుకునే ప‌ద్ధ‌తుల్లో ఎన్నో విధానాలు ఉండ‌వ‌చ్చు. లేదా విధాన సంబంధ విమ‌ర్శ‌లు కూడా దాటి వ్యక్తిగ‌త విమ‌ర్శ‌లకు ప్రాధాన్యం ఇవ్వ‌నూ వ‌చ్చు. వీటికి అతీతంగా ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడేందుకు తీసుకునే చ‌ర్య‌లే అత్యంత ప్రాధాన్యానికి సంకేతం కావాలి.
ఇదొక్క‌టే ఉత్తమ ప‌నితీరుకు ఒక రిఫ‌రెన్స్ కోడ్ కావాలి. కానీ ఇక్క‌డ త‌మ అధినేత‌ను వీలున్నంత వ‌ర‌కూ తిడుతూ, ప‌రిశ్ర‌మ‌ల‌కు సంబంధించి భ‌ద్ర‌తా చ‌ర్య‌లు తీసుకుని తీర‌డంలో త‌రుచూ విఫ‌లం అవుతున్న  యాజ‌మాన్యాల‌పై స‌రైన రీతిలో చ‌ర్య‌లు లేక‌పోవ‌డం అనేక సందేహాల‌కు ఆన‌వాలుగా నిలుస్తోంద‌ని జ‌న‌సేన పేర్కొంటోంది. ప్ర‌శ్నిస్తోంది. తాజాగా ఏలూరు ఫ్యాక్ట‌రీ బాధితుల‌కు  మంత్రి త‌ర‌ఫున భ‌రోసా లేకుండా కేవ‌లం ప‌రిహారం చెల్లించి ఊరుకోవ‌డం అస్స‌లు త‌గ‌ని ప‌ని అని ఇంత‌వ‌ర‌కూ ఆయ‌న స్పాట్ కు చేరుకున్న దాఖ‌లాలు లేవ‌ని కూడా అంటోంది జ‌న‌సేన.

ఇప్ప‌టిదాకా ఒక లెక్క ఇక‌పై ఓ లెక్క అని డైలాగులు చెప్ప‌డంతోనే కాల‌యాప‌న చేస్తున్నార‌ని వైసీపీని ఉద్దేశించి జ‌నసేన వ్యాఖ్యానిస్తోంది. ఈ మాట‌ల తీవ్ర‌త‌లు ఎలా ఉన్నా ముందుగా ఏలూరు ఫ్యాక్టరీకి సంబంధించి ప్ర‌మాద బాధితుల‌ను ఇందాక ఎవ్వ‌రూ ప‌రామ‌ర్శించిన దాఖలాలు లేవ‌ని అంటోంది. అంటే ఎవ్వ‌రూ అంటే మంత్రి స్థాయి వ్య‌క్తులు అని అర్థం. ప‌రిశ్ర‌మ‌ల‌కు సంబంధించి కొత్త అమాత్య  బాధ్య‌తలు అందుకున్న గుడివాడ అమ‌ర్నాథ్ ఈ విష‌య‌మై స్పందించిన దాఖ‌లాలే లేవ‌ని అంటోంది.

ఇక ప‌రిహారం విష‌య‌మై కూడా చాలా ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ప‌రిశ్ర‌మ‌లకు సంబంధించి ఎప్ప‌టిక‌ప్పుడు ఎక్కడో ఓ చోట యాజ‌మాన్యాల నిర్ల‌క్ష్యం కార‌ణంగానే ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి కానీ వీటిపై ప‌ట్టించుకున్న వారు చాలా త‌క్కువ. వైజాగ్ ఎల్జీ పాలిమ‌ర్స్ ఘ‌ట‌న‌కు సంబంధించి కోటి రూపాయ‌లు ఒక్కో మృతుని కుటుంబానికి చెల్లించిన దాఖలాలు ఉన్నాయి.

కానీ ఇక్క‌డ మాత్రం యాభై ల‌క్ష‌లు ఇచ్చార‌ని, ప‌రిహారం విష‌యంలో ఎందుకీ తేడాలు క‌నిపిస్తున్నాయ‌ని కూడా విప‌క్షాలు  ప్ర‌శ్నిస్తున్నాయి. ఇందులో ప్ర‌భుత్వ అధికారుల త‌ప్పిదాలు ఉన్నాయ‌ని కూడా నిందిస్తున్నాయి. ప్ర‌స్తుతానికి ఏలూరు పోర‌స్ ఫ్యాక్ట‌రీని మూయించారు స‌రే మిగ‌తా ఫ్యాక్టరీల నుంచి వెలువ‌డే విష వాయువుల నియంత్ర‌ణ విష‌య‌మై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నారు ? భ‌ద్ర‌త మ‌రియు ర‌క్ష‌ణ అన్న‌వి అస్స‌లు ప‌ట్టింపు లేని విష‌యాలుగా ఎందుకు త‌యారౌతుతున్నాయి? అని ప్ర‌శ్నిస్తున్నాయి జ‌నసేన వ‌ర్గాలు.
Tags:    

Similar News