పవన్ ఆశ : ఏపీ రాజకీయాల్లో అద్భుతం ...?

Update: 2022-05-08 12:17 GMT
ఏపీలో అద్భుతం జరుగుతుంది. ఇది జనసేనాని పవన్ కళ్యాణ్ బలమైన ఆశ. ఆయన కర్నూల్ జిల్లా టూర్ లో విలేకరులతో మాట్లాడుతూ చివరలో వాడిన పదం అద్భుతం. దానికి ముందు మీడియా ప్రతినిధులు ఆయన్ని అడిగిన ప్రశ్న ఏంటి అంటే వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకూడదు అని అంటున్నారు, అన్ని పార్టీలు కలుస్తాయా అన్న ప్రశ్నకు ఏమో ఒక అద్భుతం మాత్రం ఏపీలో జరుగుతుంది అని చెప్పుకొచ్చారు.

అంటే పవన్ కోరుకునే అధ్బుతం జనసేన టీడీపీ కూటమి కట్టినా ముఖ్యమంత్రి పదవిని పవన్ కి కేటాయించడమేనా అన్న చర్చ కూడా వస్తోంది. దీన్ని బట్టి చూస్తే పవన్ ఒక విషయంలో పక్కా క్లారిటీగా ఉన్నారని అంటున్నారు. ఈసారి జనసేన నాయకత్వంలోనే ప్రభుత్వం ఏర్పడాలన్నది ఆయన గట్టి ఉద్దేశ్యంగా చెబుతున్నారు. దానికి అనుగుణంగానే ఆయన అద్భుతం అనే మాట వాడారు అని అంటున్నారు.

నాడు అంటే 1977లో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు జాతీయ స్థాయిలో జనతా సర్కార్ ని ఏర్పాటు చేసిన తీరున ఏపీలో కూడా కలవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తానికి పవన్ పొత్తుల విషయంలో మాట్లాడింది అవి జనం కోసం ఉపయోగపడాలి తప్ప మన కోసం కాదంటూ చెప్పుకొచ్చారు. మరి ఆయన ఈ రకమైన కామెంట్స్ వెనక అర్ధమేంటి అన్నది కూడా చూడాలి.

ఇక త్యాగాలు అంటూ చంద్రబాబు గోదావరి జిల్లాల టూర్లో అన్న కామెంట్స్ ని కూడా పవన్ ముందు ప్రస్థావిస్తే ఏ రకమైన త్యాగాలు అంటూ ఆయన మీడియాను ఎదురు ప్రశ్నించడం విశేషం. ఇక తాను ఆవిర్భావ సభలో అన్న మాట వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలితే మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుంది. రాష్ట్రం ఇంకా నాశనం అవుతుంది అన్న బాధతో చెప్పాను అన్నారు.

ఆ దిశగా అందరూ కలవాలని, ఒక బలమైన ప్రత్యామ్యాయం ఏర్పడడానికి జనసేన కృషి చేస్తుంది అని చెప్పానని అన్నారు.  ఇక ఇండైరెక్ట్ గా పొత్తుల గురించి చంద్రబాబు ప్రస్థావిస్తే తానేమీ చెప్పలేనని, ఆయన డైరెక్ట్ గా మాట్లాడితే అపుడు చూద్దామని పవన్ చెప్పడం విశేషం.

ఇక ఏపీలో మూడేళ్ళ వైసీపీ పాలన దారుణంగా ఉందని పవన్ హాట్ కామెంట్స్ చేశారు. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆయన ఆవేదన వ్యత్కం చేశారు. అన్ని వర్గాల ప్రజలు బాధితులుగా మారారని అన్నారు. ఈ పరిస్థితి మారాలంటే అంతా కలసి వైసీపీ సర్కార్ ని దించే ప్రయత్నం చేయాలని ఆయన కోరారు.
Tags:    

Similar News