తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో జనసేన పోటీకి దూరంగా ఉంది. దీనిపై అనేక విశ్లేషణలు.. వ్యాఖ్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జనసేన అధినేత పవన్ స్పందించారు. మునుగోడు ఉప పోరులో తాము ఎందుకు పోటీ చేయడంలేదో ఆయన క్లారిటీ ఇచ్చారు. విధ్వంస రాజకీయాలు చేయడం ఇష్టం లేకనే.. మునుగోడులో పోటీకి దూరంగా ఉంటున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే దొడ్డిదారిలో పార్టీ మారారు.. అని వ్యాఖ్యానించారు.
అదేసమయంలో.. రాష్ట్ర విభజన సమయంలో అనేకమందికి భయం పట్టుకుందన్న పవన్.. హైదరాబాద్ లో ఆస్తులు పోతాయని ఎంపీలు ఉమ్మడి రాష్ట్రం గురించి మాట్లడలేదన్నారు. అయితే, తాను ఎవ్వరికీ భయపడేది లేదని చెప్పారు. తన ఆస్తులు లాక్కొన్నా పర్వాలేదని అక్కడే ఉన్నట్టు చెప్పారు. తిరుపతిలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ ‘‘గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతుపై నా కారణాలు నాకు ఉన్నాయి. నేను కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు రాలేదు. దేశంలో, రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం అవసరం`` అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీ ఉండి ఉంటే ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయం అయ్యేదని తెలిపారు. టీడీపీకి, వైసీపీకి కొమ్ముకాయడానికి జనసేన నాయకులు కానీ, తాను కానీ సిద్ధంగా లేమని చెప్పారు. రాజకీయంగా వారిని గౌరవిస్తాం.. విధానాలపై పోరాడతామని స్పష్టం చేశారు. సీమలో ఫ్యాక్షన్ ఎక్కువంటారని.. కానీ, తనకు అలాంటి చాయలు కనిపించలేదని అన్నారు. సీమలోని కులాల మధ్య అసమానతలున్నాయని తెలిపారు. సీమలోని అనేక ఉపకులాలకు గుర్తింపు కూడా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వెనుకబడిన వర్గాలకు కూడా రాజకీయ అధికారం రావాలని అన్నారు. వక్ఫ్ బోర్డు భూములు కబ్జాకు గురవుతున్నాయని, వైసీపీ పాలనలో పంచాయతీలకు కూడా నిధులు లేవని విమర్శలు గుప్పించారు.