ఏ ముహుర్తంలో పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రధాని మోడీ తీసుకున్నారో కానీ.. దేశంలో చిత్ర విచిత్రమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. పెద్దనోట్ల రద్దు నిర్ణయం నల్లకుబేరులకు షాక్ ఇచ్చేందుకు అని చెబుతున్నా.. అసలు కారణం అది కాదని.. దేశంలో క్యాష్ లెస్ లావాదేవీల్ని పెంచటం.. అందరిని.. అన్ని వాణిజ్య కార్యకలాపాల్ని ఆన్ రికార్డుల్లోకి తీసుకురావటమేనన్న విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.
ఈ విషయాన్ని అర్థం చేసుకోని వారంతా.. క్యాష్ కష్టాలు తీరిపోతాయన్నట్లుగా కాస్త వెయిట్ చేశారు. రోజులు గడుస్తున్నాపరిస్థితుల్లో ఎలాంటి మార్పులు రాకపోవటంతో.. చేతిలో ఉన్న నగదును ఆచితూచి ఖర్చు పెట్టటం మొదలెట్టారు. దీంతో.. కొనుగోళ్లు తగ్గు ముఖం పట్టటం.. నిత్యవసరాలు మినహాయించి.. విలాసవంతమైన కొనుగోళ్ల జోలికి ప్రజలు వెళ్లటమే మానేశారు.
ఇదిలా ఉంటే.. పెద్దనోట్ల రద్దు నిర్ణయం వ్యభిచార గృహాల మీద భారీగా పడింది. నోట్ల లభ్యత లేకపోవటం.. క్యాష్ లెస్ కు అవకాశం లేకపోవటంతో వ్యభిచార గృహాలకు వెళ్లే విటులసంఖ్య భారీగా పడిపోయిందన్న వార్తలు వచ్చాయి. దీంతో.. నిత్యం కళకళలాడే రెడ్ లైట్ ఏరియాలు బోసి పోవటమే కాదు.. తలుపు తట్టే వారు లేక వారి బతుకుతెరువు ఏమిటన్నది సందేహంగా మారింది.
ఈ సమస్యకు పరిష్కారంగా తాజాగా నాగ్ పూర్ లోని గంగా జమునా రెడ్ లైట్ ఏరియాలోని వారు పేటీఎం పేమెంట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. చేతిలో క్యాష్ లేకున్నా.. మొబైల్ లో పేటీఎం పే మెంట్ చేస్తే.. ‘సుఖాన్ని’ అందిస్తామంటూ ఆఫర్ ఇస్తున్నారు. నగదు కొరత నేపథ్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో తాము పేటీఎం ఏజెంట్లను సంప్రదించి.. ప్రత్యామ్నాయ చెల్లింపులకు మార్గాన్ని ఎంచుకున్నట్లు చెబుతున్నారు. పేటీఎం సేవలు అందని వారు.. రెడ్ లైట్ ఏరియాలోని పాన్ షాపుకున్న పేటీఎం సేవల్ని వినియోగించుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. విటుల్ని ఆకర్షించేందుకు కొందరు వ్యభిచారులు.. పేటీఎం చెల్లింపులకు ఓకే చేస్తామంటూ కరపత్రాల్ని తయారు చేయించి పంపిణీ చేస్తున్న వైనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/