నోట్ల రద్దు నిర్ణయంపై మొదటి నుంచి ఫైర్ అవుతున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి మరోసారి చిర్రెత్తింది. నోట్ల రద్దు ప్రకటించి నెల రోజులు అవుతున్నా.. ఇప్పటికి జనాలు ఏటీంలు.. బ్యాంకుల దగ్గర భారీ క్యూలైన్లలో నిలుచోవాల్సి వస్తోంది. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ నీరో చక్రవర్తి మాదిరి వ్యవహరిస్తున్నారని.. రోమ్ నగరం తగలబడిపోతుంటే ఫిడేల్ వాయించిన నీరో చక్రవర్తి మాదిరి మోడీ తీరు ఉందని గుస్సా అయ్యారు.
నోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో.. పేటీఎం లాభ పడిందన్న రాహుల్.. ఆ సంస్థ పేరును తనదైన శైలిలో మార్చేశారు. ‘‘పేటీఎం అంటే ఫే టు మోడీ’’ అని వ్యాఖ్యానించిన రాహుల్.. నోట్లను రద్దు చేసినప్పటి నుంచి పేటీఎం లాంటి వ్యాలెట్ కంపెనీలు లబ్థి పొందాయి. నోట్ల రద్దు నాటి నుంచి ఈ వ్యాలెట్ కంపెనీల లావాదేవీలు పెరిగిపోయాయి. లోక్ సభలో మాట్లాడనిస్తే ఈ కుంభకోణం గురించి చెబుతా’’ అని వ్యాఖ్యానించారు.
కొన్ని కార్పొరేట్ కంపెనీలతో ప్రధాని మోడీ కుమ్మక్కైనట్లుగా ఆరోపణలు సంధించిన రాహుల్.. అందుకు తగ్గ ఆధారాల్ని మాత్రం బయట పెట్టకపోవటం గమనార్హం. నోట్ల కొరతతో సామాన్య ప్రజలు తీవ్ర కష్టాలు పడుతుంటే.. ప్రధాని మాత్రం నవ్వుతూ ఉన్నారన్నారు. నోట్ల రద్దు నిర్ణయం పెద్ద మూర్ఖత్వ చర్యగా అభివర్ణించిన రాహుల్.. పేదలు.. రైతులు.. సామాన్యుల్ని.. వారి ఇబ్బందుల్ని పరిగణలోకి తీసుకోకుండా రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారన్నారు.
సామాన్యుల మీద రద్దు ప్రభావం భారీగా పడిందని.. దీనిపై తాను మాట్లాడటానికీ సిద్ధంగా ఉన్నానని చెప్పిన రాహుల్.. ఈ అంశంపై ప్రసంగించేందుకు ఉపన్యాసం కూడా సిద్ధంగా ఉందన్నారు. బీజేపీ నేతలు సభకు వచ్చి.. ఈ అంశంపై చర్చ మొదలు పెడితే సరిపోతుందన్నరాహుల్.. సభకు ప్రధాని రావాలని.. తనను మాట్లాడనివ్వాలని కోరారు. పరీక్ష కోసం పిల్లాడు రెఢీ అయిన చందంగా.. స్పీచ్ సిద్ధం చేసుకున్న రాహుల్ కు సభలో మాట్లాడాలన్న తొందర చాలానే ఉన్నట్లుగా కనిపిస్తోంది. మరి.. తన పరివారానికి చెప్పి.. అందరూ కామ్ గా ఉండేలా చూస్తే.. బీజేపీ నేతలు చర్చ పెట్టకుండా ఉంటారా? రద్దు అంశంపై తాము చర్చకు సిద్ధమన్న విషయాన్ని బీజేపీ నేతలు ఎప్పటి నుంచో చెబుతున్నదే. ఇప్పుడు రాహుల్ కూడా అదే కోరుకుంటున్న వేళ.. సభను సజావుగా సాగనిస్తే సరిపోతుంది కదా..?