ఈ వాహనాలన్నీ ఏమిటో తెలుసా ?

Update: 2021-01-20 16:20 GMT
ఫొటోలో కనిపిస్తున్న వాహనాలన్నీ ఏమిటో తెలుసా ? 21వ తేదీ అంటే గురువారం నుండి ఇంటింటికి రేషన్ అనే కార్యక్రమంలో గ్రామాలకు రేషన్ సరుకులను తీసుకెళ్ళేందుకు ప్రభుత్వం సేకరించిన పీడీఎస్ వాహనాలు. ఇంటింటికి రేషన్ అనే పథకం గురువారం ప్రారంభమవుతోంది. ఇందుకోసం ప్రతి గ్రామానికి వాహనంలో రేషన్ సరుకులను తీసుకెళ్ళేందుకు ప్రభుత్వం వాహనాలను సేకరించింది. రూ. 830 కోట్లు పెట్టి 9260 వాహనాలను కొనుగోలు చేసింది ప్రభుత్వం.

కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు మాత్రమే 2500 వాహనాలను కొనుగోలు చేసింది. పై ఫొటోలో కనిపిస్తున్న వాహనాలు అవే. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇతర ఫైనాన్స్ కార్పొరేషన్ల ద్వారా స్వయం సహాయంగా ఉంటుందని వాహనాలను కొనిచ్చింది. ప్రతి వాహనాన్ని ప్రభుత్వం రూ. 5.8 లక్షలు పెట్టి కొని నిరుద్యోగులకు ఇచ్చింది. ఈ మొత్తంలో రూ. 3.49 లక్షలు సబ్సిడిగా పోతోంది. అంటే మిగిలిన మొత్తాన్ని మాత్రమే నిరుద్యోగులు వాయిదాల పద్దతిలో తిరిగి ఫైనాన్స్ కార్పొరేషన్లకు చెల్లించాల్సుంటుంది.

గతంలో సుమారు 1080 108 అంబులెన్సులను కూడా కొనుగోలు చేసి అన్నీ జిల్లాలకు పంపించిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పుడు కూడా అంబులెన్సులను విజయవాడలోని బెంజిసర్కిల్లో జగన్మోహన్ రెడ్డి జెండా ఊపి జిల్లాలకు పంపిణీ చేశారు. కరోనా వైరస్ బాగా ఎక్కువున్న కాలంలో ఒకేసారి వేల అంబులెన్సులు కొనుగోలు చేసి జిల్లాలకు పంపటం అప్పట్లో జాతీయ మీడియా పెద్ద ఎత్తున కవర్ చేసింది. ఇదే పద్దతిలో తాజాగా వేలాది రేషన్ వాహనాలను గురువారం జెండా ఊపి వివిధ జిల్లాలకు పంపుతారు.


Tags:    

Similar News