గుంటూరు జిల్లాలో మహిళా ఎస్సై ఆత్మహత్యాయత్నం తీవ్ర కలకలం రేపుతోంది. జిల్లా స్థాయి ఉన్నతాధికారి వేధింపులు తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పెదకూరపాడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా ఎస్సై నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. మద్య నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎస్.ఈ.బీ సూపరింటెండెంట్ కే.బాలక్రిష్ణన్ వేధింపుల కారణంగానే ఆమె అఘాయిత్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే మహిళా ఎస్సై ఆత్మహత్యాయత్నంను ఎక్సైజ్ ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నట్టు సమాచారం. సూపరింటెండెంట్ బాలకృష్ణన్ పై సస్పెన్షన్ వేటు వేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణన్ వేధింపుల ఆరోపణలపై విచారణ కమిటీ వేసినట్లు కూడా చెబుతున్నారు.
గతంలోనూ ఈ అధికారిపై ఆరోపణలు వచ్చినట్టు సమాచారం. అప్పుడు మహిళా అదికారిపై వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. తాజాగా ఎస్సై ఆత్మహత్యాయత్నంతో ఆయనపై వెంటనే చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.