పెద్దిరెడ్డి మాటలు జగన్ వింటున్నాడా?

Update: 2021-03-10 09:30 GMT
మీడియా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యదాలాపంగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. చంద్రబాబునాయుడును ఉద్దేశించి పెద్దిరెడ్డి మాట్లాడుతు తానే గనుక సీఎం అయితే టీడీపీలో ఎంఎల్ఏలందరినీ లాగేసేవాడని అన్నారు. అప్పుడు టీడీపీలో చంద్రబాబు తప్ప ఇక మిగిలే ఎంఎల్ఏలే ఉండరు అని చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారింది.

తానే గనుక సీఎం అయ్యుంటే అన్న పెద్దిరెడ్డి మాటలు ఆయన మనసులో నుండే వచ్చాయనే ప్రచారం జరుగుతోంది. నిజానికి పెద్దిరెడ్డి చెప్పదలచుకుంది జగన్మోహన్ రెడ్డి మంచితనం గురించి. కానీ జనాలకు కన్వే అయ్యింది తానే గనుక సీఎం అయ్యుంటే అన్నదే. అంటే తాను సీఎం అవ్వాలని పెద్దిరెడ్డి తహతహ లాడుతున్నరన్న తరహాలో ప్రచారం జరుగుతోంది.

జగన్ మంచితనం వల్లే టీడీపీలో ఇంకా ఎంఎల్ఏలు కంటిన్యు అవుతున్నారని స్పష్టంగానే పెద్దిరెడ్డి చెప్పారు. వాస్తవం కూడా అలాగే ఉంది. టీడీపీ నుండి వైసీపీలో చేరటానికి కొందరు ఎంఎల్ఏలు ప్రయత్నాలు చేసుకున్నా జగన్ అంగీకరించలేదు. తమ పార్టీలోకి చేరదలచుకుంటే ముందు ఎంఎల్ఏ పదవికి రాజీనామాలు చేయాలని కండీషన్ పెట్టారు. ఈ కండీషన్ కారణంగానే టీడీపీలో కొందరు ఎంఎల్ఏలు బయటకు వచ్చేసినా నేరుగా వైసీపీలో చేరలేదు.

ఇదే విషయమై గతంలో కూడా ప్రచారం జరిగిన మాట గుర్తుండే ఉంటుంది. తొందరలోనే పెద్దిరెడ్డి ముఖ్యమంత్రి అవ్వటానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారని ఆంధ్రజ్యోతిలో కథనాలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అప్పట్లో జరిగిన ప్రచారం కేవలం ప్రచారంగానే మిగిలిపోయింది. ఎందుకంటే అదంతా కావాలనే ప్లాన్ ప్రకారమే చల్లిన బురదగా పెద్దిరెడ్డే స్వయంగా వివరణిచ్చారు. సరే మనసులో ఏమున్నా మొత్తానికి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు జగన్ విన్నారా లేదా అనే అనుమానాలైతే పెరిగిపోతున్నాయి.
Tags:    

Similar News