ఉత్తరాంధ్రా జిల్లాలు రాజకీయంగా బాగా చైతన్యవంతమైనవి. మూడు జిల్లాలు కాస్తా తాజా విభజన తరువాత ఆరుగా మారాయి. మొదటి నుంచి ఈ జిల్లాలు కాంగ్రెస్ వ్యతిరేకమైనవిగా పేరు తెచ్చుకున్నాయి. అలా కనుక చూస్తే ఎక్కువగా విపక్షాలను గెలిపించాయి. తెలుగుదేశం అధికారంలోకి రావడంతో ఎక్కువసార్లు ఆ పార్టీకే ఓటు చేస్తూ వచ్చాయి. మధ్యలో 1989లో, 2004, 2009లలో కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు ఇచ్చినా తెలుగుదేశం పార్టీని కూడా ఏ మాత్రం తక్కువ చేయలేదు. అయితే ఫస్ట్ టైమ్ 2019 ఎన్నికల్లో మాత్రం వన్ సైడెడ్ గా వైసీపీకి ఈ జిల్లాలు మద్దతు పలికి ఆ పార్టీ బంపర్ మెజారిటీకి కారణం అయ్యాయి.
అలాంటి ఈ జిల్లాలు వచ్చే ఎన్నికల్లో ఏ సైడ్ తీసుకుంటాయన్న చర్చ అయితే వాడిగా వేడిగా సాగుతోంది. ఇక ఉత్తరాంధ్రాకు ఎవరు అధికారంలోకి వచ్చినా న్యాయం అయితే జరగలేదు అని అంతా అంటారు. ఆ ఆవేదన జనాలలో బాగా ఉంది. ఇక్కడ నుంచే పెద్ద ఎత్తున వలసలు సాగుతూంటాయి. ఇక్కడ బీసీలు బీదా బిక్కీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. పారిశ్రామికంగా కూడా ఏ మాత్రం అభివృద్ధి చెందలేదు ఈ ప్రాంతాలు అన్నది నిజం.
ఇక చూస్తే ఉత్తరాంధ్రా అంటే వెనకబడిన ప్రాంతమని ఏకంగా కేంద్రం అప్పట్లో నియమించిన శ్రీ క్రిష్ణ కమిషన్ చెప్పింది. ఉత్తరాంధ్రా జిల్లాలలో విశాఖ సిటీలో కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలతో పాటు, ప్రైవేట్ పరిశ్రమల వల్ల కాస్తా ప్రగతి బాటన ఉన్నట్లు కనిపించినా ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లాతో నుంచి మొదలు పెడితే ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు పూర్తిగా అట్టడుగునే ఉన్నాయని చెప్పాలి.
ఈ జిల్లాల్లో గత అనేక దశాబ్దాలుగా మంత్రులు ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు ఉన్నారు. ఎంతో మంది గట్టి నాయకులు కూడా ఇక్కడ నుంచి గెలిచారు. ఇక కేంద్ర క్యాబినెట్ లో మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారు ఇక్కడ నుంచి ఉన్నారు. మరి ఇంతమంది ఇన్ని రకాలుగా ఏలినా కూడా ఉత్తరాంధ్రా ఎందుకు వెనకబడిపోయింది అన్నదే ప్రశ్న. అందరూ ఉత్తరంధ్రాకు అందరూ కలసి ఉత్త చేతులే చూపించారు. అధికారంలో ఉన్నపుడు ఒకలా విపక్షంలో ఉన్నపుడు మరోలా కధలు చెబుతూనే పుణ్య కాలం గడిపేశారు అన్న విమర్శలు ఉన్నాయి.
అందువల్ల ఎవరు ఎవరిని అనుకున్నా కూడా జనం మాత్రం మొత్తం ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలదే తప్పు అని డిసైడ్ చేసేశారు. చూస్తే తెలుగుదేశం ఈ రాష్ట్రాన్ని రెండు దశాబ్దాలకు పైగా ఏలింది. ఆ పార్టీ ఈ జిల్లాలను కంచుకోటలుగా మార్చుకుంది. ప్రతీ ఎన్నికలోనూ ఆ పార్టీకే ఓట్లు వేసేవారు. తమ ప్రాంతానికి వచ్చిన వలస నాయకులను సైతం ఆదరించి చట్ట సభలకు దారి చూపించారు. కానీ టీడీపీ ఉత్తరాంధ్రాకు టీడీపీ ఏం చేసింది అంటే దానికి జవాబు అయితే లేదని అంటారు.
ఇక వైసీపీని ఎంతో ఆశతో గెలిపించినా మూడేళ్ళుగా ఆ పార్టీ చేసింది కూడా ఏమీ లేదు అన్న నిర్వేదం ఈ ప్రాంత వాసులలో ఉంది. సాగు నీటి ప్రాజెక్టులకు నిధులు లేవు, పరిశ్రమలు కొత్తవి లేవు, ఇప్పటికే ప్రకటించిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా కేవలం కగితాల మీదనే ఉన్నాయి. మరి ఈ పరిస్థితులలో టీడీపీ కంటే మేమే ఉత్తరాంధ్రాను అభివృద్ధి చేశామని వైసీపీ నేతలు చెప్పుకున్నా జనాలు నమ్మేది లేదు.
దాంతో వచ్చే ఎన్నికల్లో అటు టీడీపీ ఇటు వైసీపీ ఉత్తరాంధ్రా ఓట్లను కొల్లగొట్టాలని గట్టి ప్రయత్నమే చేస్తున్నాయి. కానీ జనాలు మాత్రం ఏ రాయి అయితేనేమిటి పళ్ళూడకొట్టుకోవడానికి అన్న నిర్వేదంలో ఉన్నారు అన్నది నిజం. మరి ఎన్నికల నాటికి పరిస్థితులు మారి ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా జనాలు నిర్ణయం తీసుకుంటారో చూడాలి.