56 శాతం మంది.. మాస్క్ ఎక్క‌డ పెట్టుకుంటున్నారో తెలుసా?

Update: 2021-05-05 15:30 GMT
''వ్యాక్సిన్ వేసుకున్నా కొవిడ్ పాజిటివ్ వ‌చ్చే ఛాన్స్ ఉంది.. కాబ‌ట్టి మాస్క్ ధ‌రించ‌డ‌మే స‌రైన ప‌రిష్కారం.'' ఇదీ.. నిపుణులు చెబుతున్న మాట‌. నిజానికి ప్ర‌పంచంలోని అంద‌రికీ ఇది తెలుసు. భార‌త్ లో కొవిడ్ మ‌హ‌మ్మారి క‌రాళ నృత్యం చేస్తున్న వేళ‌.. ఈ విష‌యం తెలియ‌ని వారు ఉండే అవకాశ‌మే లేదు. కానీ.. అస‌లు విష‌యం ఏమంటే.. దేశంలో కేవ‌లం 44 శాతం మంది మాత్ర‌మే మాస్కును స‌రిగా ధ‌రిస్తున్నార‌ట‌!

దేశంలో క‌రోనా రక్షణ గురించి ప్ర‌జ‌ల‌కు అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్న.. 'ఏక్ దేశ్' సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ ఆశ్చర్యకరమైన విషయం వెలుగు చూసింది. 'అప్నా మాస్క్' పేరుతో మాస్కు యొక్క అవసరాన్ని ప్రచారం చేస్తోందీ సంస్థ. కొవిడ్ కు దూరంగా ఎలా ఉండాల‌నే విష‌యాన్ని జ‌నాల్లోకి తీసుకెళ్లేందుకు ప్ర‌యత్నిస్తోంది. ఈ సంద‌ర్భంగానే జ‌నం మాస్క్ ఎలా ఉప‌యోగిస్తున్నార‌ని ప‌రిశీలించింది.

ఆ సంస్థ నిర్వ‌హించిన స‌ర్వే ప్ర‌కారం.. దేశంలో 56 శాతం మంది మాస్కును స‌రిగా వినియోగించ‌ట్లేద‌ట‌. చాలా మంది మాస్కును ముక్కుకు ర‌క్ష‌ణ‌గా కాకుండా.. గ‌డ్డానికి రక్ష‌ణ‌గా వాడుతున్నార‌ట‌. మ‌రికొంత మంది మెడ కింద‌కు తోసేసి తిరుగుతున్నార‌ట‌. ముక్కు త‌ప్ప‌.. ఎక్క‌డెక్క‌డో మాస్కును త‌గిలించుకొని తిరుగుతున్న‌ట్టు ఆ సంస్థ తేల్చింది.

కేవలం 44 శాతం మంది మాత్రమే మాస్కును స‌రిగ్గా.. నిబంధ‌న‌ల ప్ర‌కారం ధ‌రిస్తున్న‌ట్టు స‌ద‌రు స‌ర్వే వెల్ల‌డించింది. ఈ బ్యాచ్ లో యువ‌కులే అధికంగా ఉంటున్నార‌ట‌. మాస్కు వ‌ల్ల అసౌకర్యంగా ఉంటోంద‌ని చెప్పి.. వారు తొల‌గిస్తున్నార‌ట‌. దీనివ‌ల్ల కొవిడ్ మ‌రింత‌గా విజృంభించే అవ‌కాశం ఉంద‌ని ఆ సంస్థ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. అంద‌రూ కొవిడ్ నిబంధ‌న‌లను పాటించాల‌ని, మాస్కును ధ‌రిస్తేనే.. కొవిడ్ ను పార‌దోలడం సాధ్య‌మ‌వుతుంద‌ని చెబుతోంది.
Tags:    

Similar News