కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తెస్తేనే అనుమతి..! పూరీ ఆలయంలో గవర్నర్‌ను ఆపేశారు..!
ఒడిశా రాష్ట్రంలోని పూరి జగన్నాథ ఆలయంలో ఆ రాష్ట్ర గవర్నర్‌కే చేదు అనుభవం ఎదురైంది. ఆయన గుడిలోకి వెళ్లి దర్శనం చేద్దామనుకున్నా.. అక్కడున్న నిబంధనలతో ఆగిపోయారు. పురి జగన్నాథ ఆలయంలోకి ఎవరైనా వెళ్లాలంటే కరోనా నెగిటివ్ రిపోర్ట్ ఉండాల్సిందే. దీంతో గవర్నర్ గణేశీ లాల్ వెనుదిరిగి వెళ్లిపోయారు. గవర్నర్‌ను గుడిలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేదని అక్కడి నిబంధనుల చూసి ఆయనే స్వయంగా వెళ్లిపోయినట్టు సమాచారం. ఆదివారం ఒడిశా గవర్నర్ గణేశీ లాల్‌కు పూరీ జగన్నాథుని సన్నిధికి వెళ్లారు. అక్కడి గుడికి ఎవరు వెళ్లాలన్నా కరోనా నెగిటివ్ రిపోర్ట్ ఉండాల్సిందే. దీంతో గవర్నర్ దగ్గర కరోనా నెగిటివ్ రిపోర్ట్ లేదు. దీంతో ఆయనే స్వచ్చందంగా వెనుదిరిగారని సమాచారం.
కరోనా కారణంగా చాలా రోజులుగా పూరీ జగన్నాథ ఆలయాన్ని మూసివేశారు. అయితే కరోనా ఉధృతి తగ్గడంతో ఇటీవలే ఆలయ ప్రవేశానికి అనుమతిస్తున్నారు. కానీ కొన్ని నిబంధనలు విధించారు. ఈ నిబంధనల ప్రకారం.. ఆలయానికి రావాలనుకున్నవారు కచ్చితంగా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకురావాల్సిందే. అయితే గవర్నర్‌కు ఈ విషయం ముందే తెలుసా.. తెలియదా? అన్న విషయంపై క్లారిటీ లేదు. మరోవైపు గవర్నర్ కార్యాలయ అధికారులకు ఈ విషయం కూడా ఇప్పటివరకు క్లారిటీ లేదు.
కానీ గవర్నర్‌ను పూరీ ఆలయ అధికారులు అడ్డుకున్నారన్న వార్తలు వచ్చాయి. దీంతో కొంత గందరగోళం నెలకొన్నది. అయితే సాక్షాత్తు రాష్ట్రానికి ప్రథమ పౌరుడైన వ్యక్తిని గుడిలోకి రాకుండా ఆపడటం ఏమిటన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. కానీ గవర్నర్‌ను ఆలయ అధికారులు ఎవరూ ఆపలేదని.. ఆయన స్వయంగా వెనుదిరిగారని ఆలయ అధికారులు క్లారిటీ ఇచ్చారు.