తాజాగా కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభపై అనేక అంచనాలు వున్నాయి. నిజానికి ఆవిర్భావ సభను ప్రకటించిన తర్వాత.. ఈ సభపై అనేక ఆశలు.. పెరిగిపోయాయి. పవన్ ఏదైనా సంచలన ప్రకటన చేస్తారని.. పొత్తులపై మాట్లాడతారని.. ఇంకేముంది..ఖచ్చితంగా వచ్చే ఎన్నికల వ్యూహాన్ని కూడా ఆవిష్కరిస్తారని అనుకున్నారు. కానీ, అవేవీ లేకుండా.. అశేష అభిమాన గణా న్ని మరిన్ని సందేహాల్లో ముంచేశారు పవన్.
ఇదిలావుంటే.. జనసేన ఆవిర్భావ సభ విషయంలో మరో ప్రచారం కూడా కొన్నాళ్లుగా సాగింది. ఈ పదేళ్ల పార్టీ పండగలో భారీ ఎత్తున చేరికలు ఉంటాయని..కనీసం నలుగురు నుంచి పది మంది వరకు వైసీపీ నాయకులుపార్టీలో చేరతారని.. జనసేన వర్గాలు చెప్పుకొచ్చాయి. ఇటీవల మంగళగిరిలో జరిగిన కార్య క్రమంలో టీవీ రామారావు వంటి కీలక నేతలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈయన బలమైన నాయ కుడు కావడం గమనార్హం.
దీంతో మిగిలిన నాయకులు కూడా రెడీగా ఉన్నారని.. వారంతా కూడా మచిలీపట్నం సభలో పవన్ సమ క్షంలో జనసేన కు జై కొడతారని అందరూ భావించారు. పార్టీ నాయకులు కూడా ఇదే ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్నే ఉటంకిస్తూ.. మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ పక్కన చేరేది.. ఎవరైనా ఉంటే చేరబోయేది తప్పాతాలూ తప్ప ఏమీ లేదన్నారు. సభకు కొన్ని గంటల ముందు నాని చేసిన వ్యాఖ్యలు కూడా.. చేరికల ప్రచారానికి హైప్ తెచ్చాయి.
అయితే.. తీరా చూస్తే.. ఒక్కరుకూడా జనసేనలో చేరలేదు. పార్టీ నిర్వహించిన పదేళ్ల వేడుక వేదికపై.. ఎలాంటి చేరికలు లేకుండా కేవలం కౌలు రైతుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున పంపిణీకే పరిమితం అయ్యారు. అదేసమయంలో పవన్ కూడా రండి.. పార్టీలో చేరండి అని పిలుపు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. మొత్తానికి ఇటు పార్టీ అభిమానులు..అటు పవన్ అభిమానులు ఎదురు చూసిన చేరిక ల అంశం తుస్సు మందనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.