కేటాయించిన నీటికంటే చెంచా నీటిని కూడా ఎక్కువ తీసుకోం: పేర్నినాని

Update: 2021-06-25 12:13 GMT
కృష్ణా జలాల వివాదంపై ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. తెలంగాణ నేతల వాదనలను ఖండించారు. తెలంగాణ నేతల వాదన రాజకీయ అవసరమే అని చెప్పుకొచ్చారు. ఉద్వేగాలను, భావోద్వేగాలను రెచ్చగొట్టడం వల్ల తెలుగు రాష్ట్రాలకు దమ్మిడి ఉపయోగం ఉందా? అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.ఏపీకి కేటాయించిన నీటి కంటే ఎక్కువగా చెంచాడు నీటిని కూడా తీసుకోవడం లేదని స్పష్టం చేశారు.

కృష్ణా జల వివాదంపై ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ తో చర్చలు జరపడానికి ఏపీ సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలుగు రాష్ట్రాలకు ఇరిగేషన్ పరంగా ఎంతో మేలు చేశారని.. ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో రాజకీయ అవసరాల కోసమే వైఎస్ఆర్ ను విమర్శిస్తానని మంత్రి పేర్ని నాని విమర్శించారు.

ఇక పదోతరగతి, ఇంటర్ పరీక్షలను సుప్రీంకోర్టు సూచనల మేరకే రద్దు చేశామని మంత్రి పేర్ని నాని వివరణ ఇచ్చారు. ఈ నిర్ణయంతో టీడీపీ అధినేత చంద్రబాబు విలయతాండవం చేస్తున్నారని పేర్నినాని ఎద్దేవా చేశారు. పరీక్షలు రద్దు చేసినందుకు చంద్రబాబు మానసిక ఆనందం పొందుతున్నాడని.. వ్యవస్థలను మేనేజ్ చేసే సత్తా చంద్రబాబుకు ఉందని అందరూ ఒప్పుకుంటున్నారని పేర్నినాని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు అబ్బాయి లేదా.. మా అబ్బాయిని చదివించేందుకు రామలింగరాజు లాంటి డబ్బున్న వాళ్లు ముందుకొస్తారని.. కానీ పేదల పిల్లలను చదివించేందుకు ఎవరు ముందుకొస్తారని పేర్నినాని సెటైర్లు పేల్చారు.  పిల్లలకు మేలు చేయాలనే ప్రభుత్వం భావిస్తోందని..చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని పేర్నినాని విమర్శలు గుప్పించారు.
Tags:    

Similar News