తెలంగాణా మంత్రి హరీష్ రావుకు కేసీయార్ మీద పీకల దాకా కోసం ఉందా. ఉంటే అది ఏపీకి చెందిన మాజీ మంత్రికి ఎలా తెలిసింది. ఏమో తనకు అంతా తెలుసు అంటున్నారు మాజీ మంత్రి పేర్ని నాని. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుగా మామ మీద కోపం పెట్టుకుని ఏపీలోని వైసీపీ ప్రభుత్వం మీద హరీష్ రావు విమర్శలు చేస్తున్నారు అని పేర్ని నాని అంటున్నారు.
హరీష్ రావు ప్లాన్ ఏంటంటే తాము ఆవేశపడిపోయి కేసీయార్ ని నాలుగు మాటలు అంటే మామను ఆ విధంగా తిట్లు తినిపించి మానసిక ఆనందం పొందడమే హరీష్ రావు టార్గెట్ అని అంటున్నారు. కేసీయార్ ని తిట్టించాలి అంటే వైసీపీ మీద పడిపోతే వారే తగులుకుంటారన్న ఒక విధమైన కుత్సిత ఆలోచనతోనే హరీష్ రావు మాటిమాటికి తమ మీద పడి విమర్శలు చేస్తున్నారని పేర్ని నాని తేల్చేశారు.
కేసీయార్ అమాయకుడు అయితే ఏనాడో ఆయన్ని అధికార పీఠం నుంచి కూలదోసి తాను సీఎం అయ్యేందుకు హరీష్ రావు కుట్రకు తెర లేపేవాడేనని పేర్ని నాని కొత్త విషయం చెప్పారు. ఏపీ ప్రభుత్వానివి మాటలు మాత్రమే అని అంటున్న హరీష్ రావు చేతలు ఏంటో తమకు తెలియదా అని పేర్ని నాని ఎకసెక్కమాడారు. ఆయన చేతలు మరీ ఎక్కువ కావడం వల్లనే కేసీయార్ 2018లో రెండవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి పదవి ఇవ్వకుండా దూరం పెట్టారని పేర్ని నాని ఫ్లాష్ బ్యాక్ ని గుర్తుకు తెచ్చారు.
హరీష్ రావు సంగతేంటో తెలుసు కనుకనే కేసీయార్ అలా చేశారని అన్నారు. చంద్రబాబు బాటలో వెళ్ళి మామకు వెన్నుపోటు పొడుద్దామనుకుంటే అక్కడ ఉన్నది కేసీయార్ అని ఎన్టీయార్ కాదని పేర్ని నని ఎద్దేవా చేశారు. కేటీయార్ అన్నా కేసీయార్ అన్నా పీకల దాకా కోపం పెట్టుకుని హరీష్ వైసీపీ మీద చేసే విమర్శలను తాము లైట్ తీసుకుంటామని అన్నారు.
అయినా ఏపీ గురించి హరీష్ రావుకు ఎందుకు అని ఆయన నిలదీశారు. చాలా కాలంగా వైసీపీ నుంచి కేసీయార్ తిట్టాలని అది విని తాను సంబరపడాలని హరీష్ రావు ఉబలాటపడుతున్నారని, అయితే ఆ కోరికను తొందరలోనే తీరుస్తామని పేర్ని నాని చెప్పడం విశేషం. ఈసారి హరీష్ రావు మళ్లీ ఏపీ సర్కార్ మీద వైసీపీ మీద నోరు చేసుకుంటే మాత్రం కేసీయార్ నే నేరుగా అనాల్సి వస్తుందని ఆయన అంటున్నారు.
మొత్తానికి వెటకారాన్ని మిళాయించి మరీ హరీష్ రావుకు పేర్ని నాని ఇవ్వాలినవి నాలుగు ఇచ్చేశారు అంటున్నారు. మరి పేర్ని నాని చెప్పినట్లుగా కేసీయార్ మీద పీకల్లోతు కోపం హరీష్ కి ఉందా. ఆయన సీఎం కావాలనుకుంటున్నారా ఇవన్నీ పేర్ని నానికి ఎలా తెలుసు అంటే రాజకీయాల్లో ఇవన్నీ మామూలే అనుకోవాలేమో.