ప‌వ‌న్ (X) నాని: నువ్వు స‌న్నాసి అంటే నేను స‌న్నాసిన్న‌ర‌ అన్నాను

Update: 2021-09-29 13:07 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ -ఏపీ ప్ర‌భుత్వ మంత్రులు మ‌ధ్య మాట‌ల యుద్దం న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. `రిప‌బ్లిక్` ప్రీ రిలీజ్  ఈవెంట్ వేదిక‌గా తెర లేచిన వివాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై మంత్రి నాని..పోసాని కృష్ణ‌మురిళి ఎదురుదాడికి దిగారు. ఒక‌రిపై ఒక‌రు పోటాపోటీగా మీడియా స‌మావేశాలే ఏర్పాటు చేసి దాడి చేసుకుంటున్నారు. తాజాగా కొద్దిసేప‌టి క్రిత‌మే మంత్రి నాని చిత్ర ప‌రిశ్ర‌మ పెద్ద‌ల స‌మ‌క్షంలో మీడియా స‌మావేశం ఏర్పాటు  చేసి ప‌వ‌న్ పై కౌంటర్ ఏటాక్ కి దిగారు.  ప‌వ‌న్ పై తీవ్ర ప‌ద‌జాలంతో దాడి చేసారు.

సంస్కారం లేనిది నాకా నీకా?  ముందుగా వివాదం రేపింది నువ్వా?  నేనా?  నువ్వు స‌న్నాసి అంటే నేను స‌న్నాసిన్న‌ర‌ అన్నాను. అందులో త‌ప్పేముంది? నాకు సంస్కారం లేదు. మా అమ్మ ముందే పైకెళ్లిపోయింది కాబ‌ట్టి ఆవిడ నాకు నేర్ప‌లేదు. మ‌రి మీ అమ్మ‌గారు అంజ‌నా దేవిగారు ఉన్నారు క‌దా? అవిడ నీకు సంస్కారం నేర్పాలి క‌దా? మ‌రెందుకు నేర్ప‌లేదు. అవాకులు చెవాకులు పేలితే ఊరుకోం. ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తిపై ఎలా మాట్లాడాలో తెలియ‌దు. నువ్వొక‌ రాజ‌కీయ పార్టీ న‌డుపుతున్నావు. అది రాజ‌కీయ‌ పార్టీనా..షామినా షాపా అంటూ మంత్రి నాని ఆక్షేపించారు. ఇప్ప‌టివ‌కూ ఇలాంటి రాజ‌కీయ పార్టీని ఎక్క‌డా చూడ‌లేదని విమ‌ర్శించారు.

కోస్తాంధ్రాలో ఓ సంస్కృతి ఉంది. ఒక‌రు వాయినం ఇస్తే తిర‌గి వాయినం ఇవ్వ‌డం ఇక్క‌డ అల‌వాటు. ఇప్పుడు అదే జ‌రిగింది. ఎవ‌రిది వారికి తిరిగిచ్చేయ‌డం అల‌వాటు. అది ఓ  సంప్ర‌దాయం అని ప‌వ‌న్ ని మంత్రి నానీ ఎద్దేవా చేసారు. ఈ విష‌యంపై  పెద్ద‌లు చిరంజీవి గారు కూడా ఊటీ నుంచి  ఫోన్ చేసి విచారం వ్య‌క్తం చేసారు. అలా జ‌రిగి ఉండాల్సింది కాద‌న్నారు. ఊటీ నుంచి రాగానే క‌లుస్తాన‌ని అని అన్నారు. అయితే నాని ఈ స‌మావేశాన్ని  చిత్ర ప‌రిశ్ర‌మ పెద్ద‌ల స‌మ‌క్షంలో నిర్వ‌హించ‌డం గ‌మ‌నార్హం.  నిర్మాత దిల్ రాజు..మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాత‌లు..సునీల్ నారంగ్ త‌దితరులు ఈ మీడియా స‌మావేశంలో పాల్గొన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసి వ్యాఖ్య‌ల‌కు త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని..త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకోవ‌డానికి మంత్రిని క‌లిసామ‌ని చెప్పిన‌ట్లు మంత్రివ‌ర్యులు తెలిపారు. మొత్తానికి మంత్రి గారు ఇండస్ట్రీ మ‌ద్ధ‌తు కూడ‌గ‌ట్టి జ‌న‌సేనానిపై ఎటాక్ కి దిగారు.

ఆన్ లైన్ టికెటింగ్ కి ఏజెన్సీ ఏర్పాటు!

ఏజెన్సీని ఏర్పాటు చేసి ఆన్ లైన్ టికెటింగ్ వ్య‌వ‌స్థ‌ను అప్ప‌గిస్తామ‌ని మంత్రి నాని అన్నారు. ప్ర‌పంచ సినిమా మొత్తం ఆన్ లైన్ టికెటింగ్ న‌డుస్తుంది. ఏపీఎస్ ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ లాగా సినిమా టిక్కెట్ల‌కు ప్ర‌భుత్వ పోర్ట‌ల్ ఏర్పాటు చేస్తాం. దీనిని ఒక ఏజెన్సీ చూసుకుంటుంది. సినీపెద్ద‌లు చాలా మంది నాతో ఫోన్ లో మాట్లాడారు. సాధ‌క‌బాధ‌కాలు మాట్లాడారు. అన్నిటినీ ప‌రిశీలించాం. మా ప్ర‌భుత్వం త‌ర‌పున వాస్త‌వాల‌కు స్పందిస్తాం. అవాస్త‌వాల‌ను చెడుగా రుద్దాల‌ని చూస్తే ఇండ‌స్ట్రీ నుంచి త‌ప్పుగా గొంతు విప్పితే రౌద్ర వాతావ‌ర‌ణం ఉంటుంది. ఇండ‌స్ట్రీ క‌లెక్టివ్ గా చెప్పాలి. వాటిని ప‌రిశీలిస్తాం. ప్ర‌భుత్వం సానుకూలంగా ఉంది ఇండ‌స్ట్రీని బ‌తికించ‌డానికి మా వంతు కృషి చేస్తాం.. అన్నారు.  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సినిమా టిక్కెట్ల‌పై బ‌తికేయ‌దు క‌దా..మేం మాట్లాడ‌కుండా వెళ్లిపోతే మీరు అడ‌గాలి. అంద‌రు ఇండ‌స్ట్రీ వాటాదారుల‌తో మాట్లాడి ప‌రిశీలిస్తున్నాం. మీకేం కావాలో చేస్తాం. ఎలా చేయాలో మీరే చేయండి అని మీరే అన్నారు.. అని తెలిపారు. పోర్ట‌ల్ కోసం సాఫ్ట్ వేర్ రూప‌క‌ల్ప‌న ప‌నిని ఏపీ టెక్నాల‌జీ స‌ర్వీసెస్ కి అప్ప‌జెబుతున్నాం. ఫిలిండెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ (ఎఫ్ డీసీ) దీనిని ప‌ర్య‌వేక్షిస్తుంది.. అన్నారు.
Tags:    

Similar News