తెలుగుదేశం పార్టీ తరఫున సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గిన ముగ్గురు ఎంపీల్లో ఒకరు గల్లా జయదేవ్. స్వల్ప మెజారిటీతో ఆయన గుంటూరు నుంచి ఎంపీగా నెగ్గారు. అయితే ఆ గెలుపు ఫలితాల వెల్లడి రోజునే చర్చనీయాంశంగా నిలిచింది. గల్లా జయదేవ్ గెలిచాడంటూ అనౌన్స్ చేయడాన్ని ఆయన ప్రత్యర్థి - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆక్షేపించారు. ఆ ప్రకటనపై కోర్టుకు వెళ్తున్నట్టుగా ఆయన ప్రకటించారు.
ఆ మేరకు ఒక పిటిషన్ దాఖలు అయ్యింది. దాదాపు తొమ్మిది వేలకు పైగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించకుండానే గుంటూరు ఎంపీ సీటు ఫలితాన్ని ప్రకటించినట్టుగా తెలుస్తోంది. ఏవో సీరియల్ నంబర్స్ లేవనే చిన్న కారణం చేత అన్ని పోస్టల్ బ్యాలెట్ లను లెక్కించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఆ అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిటిషన్ దాఖలు అయిన తర్వాత ఇప్పుడు, అదే అంశంపై ఉద్యోగులు కూడా పిటిషన్ దాఖలు చేశారు. తమ పోస్టల్ బ్యాలెట్లను లెక్క పెట్టకపోవడాన్ని వారు తప్పు పడుతూ ఈసీపై కోర్టును ఆశ్రయించారు. మరి ఈ అంశంపై కోర్టు ఎలా స్పందిస్తుంది? ఈసీ ఏమంటుందనేది ఆసక్తిదాయకంగా మారింది.