అంకెలు చెప్పే వాస్తవాలు కర్ణకఠోరంగా ఉంటాయి. చాలామంది పెద్దగా పట్టించుకోరు కానీ.. లెక్కల లోతుల్లోకి వెళ్లే కొద్ది కళ్లు బైర్లు కమ్మేసేలా చేస్తుంటాయి అప్పుడప్పుడు. పెట్రోల్.. డీజిల్ ధరలకు సంబంధించిన లెక్కల్లోకి వెళితే.. ఇలాంటి అనుభవం ఖాయం. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ రూ.90 దాటేసింది. లీటరు డీజిల్ రూ.83 టచ్ చేసింది. తాజాగా సాగుతున్న దూకుడు చూస్తే.. మరికొద్దికాలంలోనే లీటరు పెట్రోల్ సెంచరీ కొట్టటం ఖాయమని తేలుతుంది. కాకుంటే.. మరికొద్ది నెలల్లో పలు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో.. మార్చి.. ఏప్రిల్ తర్వాత నుంచి పెట్రోల్.. డీజిల్ ధరలు తగ్గుతాయన్న లెక్క ఒకటి వినిపిస్తోంది. ఈ విషయాన్ని ఇలా ఉంచితే.. మౌన ప్రధానిగా పేరున్న మన్మోహన్ సింగ్ హయాంలో పెట్రోల్.. డీజిల్ ధరలకు.. మోడీ సర్కారులో ఉన్న ధరల్లో మార్పులు ఇట్టే కనిపిస్తాయి.
ఈ ధరల లోతుల్లోకి వెళితే.. షాకింగ్ నిజాలు బయటకు రావటమే కాదు.. మోడీ హయాంలో ఎడాపెడా పన్నులతో ఇంతలా ప్రజల నడ్డి విరుస్తున్నారా? అన్న సందేహం రాక మానదు. ఎందుకంటే.. మన్మోహన్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు పెట్రోల్ మీద ఎక్సైజ్ డ్యూటీ లీటరుకు రూ.9.48 పైసలు ఉంటే.. డీజిల్ మీద రూ.3.56 ఉండేది. మోడీ హయాంలో ఎక్సైజ్ పన్ను భారీగా పెరిగిపోయింది. క్రమపద్దతిలో పెంచుకుంటూ వచ్చిన ఆయన.. ఇప్పుడు వడ్డిస్తున్న వడ్డన లెక్కకు షాక్ కావాల్సిందే.
ఈ లెక్క మరింత వివరంగా తెలియాలంటే.. మన్మోహన్ సింగ్ హయాంలో విధించిన పన్ను విధానాన్ని తీసుకుంటే.. ఈ రోజున రూ.67 మాత్రమే ఉండేది. కానీ.. ఇప్పుడు లీటరు రూ.90 ఉంది. అంటే.. లీటరుకు అదనంగా రూ.23 చొప్పున మోడీ సర్కారు బాదేస్తుంది. మన్మోహన్ హయాంలో ఉన్న పన్నుల ప్రకారం పెట్రోల్ మీద ఎక్సైజ్ డ్యూటీ రూ.10 ఉంటే.. వ్యాట్ రూ.22.70 ఉండేది. డీలర్ కమిషన్ రూ.3.45.. రవాణా రూ.1.18గా ఉంది.అన్నింటిని కలుపుకొని లీటరు పెట్రోల్ రూ.67ఉండేది.
తాజాగా లీటరు పెట్రోల్ ధర రూ.90 ఉంది. దీని బ్రేకప్ చూస్తే.. పెట్రోల్ మౌలిక ధర రూ.32లోపే. మిగిలినదంతా.. అంటే 58 రూపాయిలు పన్నులు.. డీలర్ మార్జిన్.. రవాణా చార్జీలు కలిసి ఉన్నాయి. ఇందులో పన్నుల పోటే ఎక్కువగా ఉండటం గమనార్హం.
ఇదంతా చూసినప్పుడు.. పెట్రోల్.. డీజిల్ పైన మోడీ సర్కారు అనుసరిస్తున్న పన్ను విధానం పుణ్యమా అని ఖజానాకు వేలాది కోట్లు మిగుల్చుకోవటం మినహా.. సామాన్య.. మధ్యతరగతి జీవి నడ్డి మీద పన్ను బాదుడు గురించి పెద్దగా ఆలోచించటం లేదని చెప్పాలి. భారీగా పెంచేసిన ఎక్సైజ్ డ్యూటీతో పెట్రోధరలు భగ్గుమంటున్నాయి. గడిచిన ఆరేళ్లలో మోడీ సర్కారు ఎక్సైజ్ డ్యూటీ వసూళ్లు దాదాపు రూ.14.6 లక్షల కోట్లుగా చెప్పాలి. ఇందులో రాష్ట్రాల వాటా రూ.5లక్షల కోట్లు ఉంటే.. మిగిలినదంతా కేంద్ర ఖజానాకే చేరిందన్నది మర్చిపోకూడదు.