పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 18వ రోజు కూడా పెరిగాయి. ఈసారి డీజిల్ ధరలను పెంచిన చమురు కంపెనీలు పెట్రోల్ ధరలు జోలికి వెళ్లలేదు. లీటర్ డీజిల్ ధర 48 పైసలు పెరిగింది ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 79.76 ఉండగా డీజిల్ ధర రూ. 79.88 కు చేరింది. దీనితో మొదటిసారి పెట్రోల్ ధర కంటే డీజల్ ధర ఎక్కువగా ఉంది. జూన్ 7 నుంచి ఇప్పటివరకు పెట్రోల్ ధర రూ.8.50 పెరగ్గా, డీజిల్ రూ 10.48 పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.82 దాటింది.
కేవలం 18 రోజుల వ్యవధిలో ఇంత భారీ స్థాయిలో రేట్లు పెరగడం 2002 తర్వాత ఇదే తొలిసారి. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు రూ.80 దాటాయి.. హైదరాబాద్ లో బుధవారం లీటరు పెట్రోల్ ధర 20 పైసలు పెరుగుదలతో రూ.82.79కు, డీజిల్ ధర 54 పైసలు పెరుగుదలతో రూ.77.60కు ఎగిసింది. విజయవాడలో పెట్రోల్ ధర 55 పైసలు పెరుగుదలతో రూ.80.66కు చేరింది. అలాగే చెన్నై, పాట్నాలలో లీటరు పెట్రోల్ ధర 80 రూపాయలు దాటింది. కోల్‌కతా, బెంగళూరులలో లీటరు ధర 79 రూపాయలు గా ఉంది.