క్రేజీ ఆఫర్.. మొబైల్ కొంటే పెట్రోల్, నిమ్మకాయలు ఫ్రీ అంట!

Update: 2022-04-21 07:20 GMT
మార్కెట్లో తమ ఉత్పత్తులను పరిచయం చేసేందుకు.. దూసుకెళ్లేందుకు, కస్టమర్ దృష్టిని ఆకర్షించేందుకు చేసే పనులు చూస్తుంటే గమ్మత్తుగా అనిపిస్తుంది. కార్పొరేట్ కంపెనీల నుంచి గల్లీ కొట్టు వరకు వారి వారి స్థాయిల్లో తమ ఉత్పత్తులను ప్రచారం చేస్కుంటూ ఉంటారు. పెద్ద పెద్ద బ్రాండ్ లు అయితే సినీ నటులతో యాడ్స్ కూడా చేయించుకుంటూ ఉంటారు. అలాగే బంపర్ ఆఫర్స్ ప్రకటిస్తూ... కొనుగోలు దారులు ఆకర్షిస్తుంటారు. పండుగలు, పబ్బాలు అప్పుడు అయితే విపరీతమైన ఆఫర్లు ఇస్తుంటారు. ఇదంతా మనకు తెలిసిందే. కానీ వారణాసికి చెందిన ఓ వ్యాపారి.. క్రేజీ ఆఫర్ ప్రకటించాడు. అయితే అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

వారణాసికి చెందిన ఓ మొబైల్ స్టోర్ యజమాని ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు సరికొత్త ప్రచారానికి తెర తీశారు. ఈ ఆఫర్ గురించి తెలిసిన వారంతా... క్రేజీ ఐడియా అంటూ అవాక్కవుతున్నారు. ఆ ఐడియా అంటంటే... తన షాప్ లో పది వేల రూపాయలకు పైగా విలువ చేసే మొబైల్ ఫోన్ కొన్న వాళ్లకు లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. అంతే కాకుండా మొబైల్ ఫోన్ యాక్సెసరీస్ కొనుగోలు చేస్తే... ఐదు నిమ్మ కాయలను కూడా ఇస్తామని స్పష్టం చేశారు.

మిగిలిన మొబైల్ స్టోర్ లకు భిన్నంగా మొబి వరల్డ్ ప్రకటించిన ఆ ఆఫర్ అందరి దృష్టిని ఆకర్షించింది. మండుటెండలో కూడా ఈ ఆఫర్ గురించి తెలుసుకునేందుకు స్టోర్ కు వస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.

అంతే కాదండోయ్ మొబైల్ ఫోన్లతో పాటు యాక్సెసరీస్ కొంటూ... ఉచితంగా వచ్చే లీటర్ పెట్రోల్, ఐదు నిమ్మ కాయలను సొంతం చేసుకుంటున్నారు. అయితే మార్కెట్లలో పెట్రోల్, నిమ్మకాయల ధరలు పెరగడం వల్లే ఈ ఆఫర్  ప్రకటించినట్లు మొబైల్ స్టోర్ యజమాని చెబుతున్నాడు.

అయితే తనకు వచ్చిన ఈ కొత్త ఐడియా వల్లే తమ షాప్ కు ఎక్కువ మంది జనాలు వస్తున్నారని చెబుతున్నాడు. అంతే కాదు ఎక్కువ మొబైల్ ఫోన్ లు అమ్ముడు పోయాని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. గతంలో ఫోన్ కొనుగోలు చేసిన వారికి యాక్సెసరీస్ వంటివి ఉచితంగా ఇచ్చామే తప్ప.. ఇలా డిఫరెంట్ గా ఎప్పుడూ ట్రై చేయలేమని వివరించారు.

ఏదైతే ఏంటి.. ఎక్కువ ధర ఉన్న ఎలాంటి వాటినైనా ఉచితంగా ఇస్తామంటే కొనుగోళ్లు బాగా సాగుతాయనే విషయం అర్థం అయిందని పేర్కొన్నారు. వ్యాపారులు... అమ్మకాలు బాగా సాగాలంటే మీరు కూడా ఇలా డిఫరెంట్ ఆఫర్స్ ఇచ్చి కొనుగోలు దారులను ఆకట్టుకోండి.
Tags:    

Similar News