పికిల్ కింగ్ ఆఫ్ ది వరల్డ్ రికార్డు.. ఎగుమతుల్లో భారత్ అగ్రస్థానం!

Update: 2022-01-24 08:30 GMT
పికిల్ కింగ్ ఆఫ్ ది వరల్డ్ గా పిలువబడే గెర్కిన్ ఎగుమతుల్లో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది. కార్నికాన్స్ అని పిలువబడే ఈ ఉత్పత్తులు 200 మిలియన్ డాలర్ల మార్క్ ను సొంతం చేసుకున్నాయి. మనదేశం నుంచి 20 కంటే ఎక్కువ దేశాలకు ఎక్స్ పోర్టు చేస్తున్నారు.  ఈ పిక్లింగ్ దోసకాయలు ఎక్కువగా యూఎస్, జర్మనీ, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, స్పెయిన్, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, బెల్జియం, రష్యా, ఇజ్రాయెల్, శ్రీలంక దేశాలకు అధికంగా ఎగుమతి చేస్తున్నారు.

భారతదేశం 2021 ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో  1,23,846 మెట్రిక్ టన్నుల గెర్కిన్స్ ను ఎగుమతి చేసింది. వీటి విలువ రూ. 144 మిలియన్ డాలర్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. 2020-21 ఏడాదికి గాను మొత్తం 2,23,515 మెట్రిక్ టన్నులను ఎక్స్ పోర్టు చేసింది. మొత్తం రూ.223 మిలియన్ డాలర్లు మార్కెటింగ్ జరిగింది. మనదేశంలో సుమార్ 51 కంపెనీలు గెర్కిన్స్ ఉత్పత్తి, ఎగుమతిని చేస్తున్నాయి. విదేశీ వినియోగదారుల అవసరాల మేరకు డ్రమ్స్, రెడీ టూ ఈట్ కన్జ్యూమర్ ప్యాక్ లను సిద్ధం చేసి విక్రయిస్తున్నారు.

భారతదేశంలో శుద్ధి చేసిన నాణ్యమైన గెర్కిన్స్ సాగు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మన దేశంలో మొత్తం 60వేల ఎకరాల భూమిలో దాదాపు 90వేల చిన్న, సన్నకారు రైతులు వీటిని సాగు చేస్తున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతంలోని యువతకు ఉపాధి లభిస్తోంది. ఎకరం భూమిలో దాదాపు నాలుగు మెట్రిక్ టన్నుల గెర్కిన్ దిగుబడి వస్తుంది. వీటితో రూ.80 వేల ఆదాయం రాగా... రైతుకు దాదాపు రూ.40వేలు మిగులుతున్నాయి. 90 రోజుల్లో పంట చేతికి వస్తుంది.

మనదేశంలో తొలుత కర్ణాటకలో  ఈ సాగును మొదలుపెట్టారు. 1990 నుంచి ఆ రాష్ట్రంలో వీటిని సాగు చేస్తున్నారు. అనంతరం పొరుగు రాష్ట్రాలకు విస్తరించింది. కాలానుగుణంగా కర్ణాటక పక్కనే ఉన్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ సాగు అవుతున్నాయి. ఒప్పంద వ్యవసాయ పద్ధతిలో వీటిని పండిస్తున్నారు. . అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి మనం దేశం నుంచి శుద్ధి చేసిన గెర్కిన్ లను ఎగుమతి చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రపంచదేశాలకు కావాల్సిన గెర్కిన్ అవసరాల్లో మనదేశం నుంచే 15 శాతం ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. గెర్కిన్ ఎగుమతుల్లో భారత్ దే అగ్రస్థానం అని ఈ సందర్భంగా వెల్లడించారు.

గెర్కిన్ ఉత్పత్తులను మరింత పెంచడానికి వాణిజ్య శాఖ, వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. ఈ సాగుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. ప్రపంచ మార్కెట్ లో దీనికి ప్రచారం కల్పిస్తున్నారు. ఆహార భద్రతా ప్రమాణాలు కల్పించేలా వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు.  


Tags:    

Similar News