అధికారపార్టీలోని తాజా, మాజీ ప్రజా ప్రతినిధుల మధ్య శిరోముండనం కేసు మళ్ళీ చిచ్చు పెడుతోంది. దాదాపు 25 ఏళ్ళ క్రితం తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గంలో దళితులను చెట్టుకు కట్టేసి శిరోముండనం (గుండు కొట్టించటం) చేయించిన ఘటన దేశంలోనే సంచలనమైంది. ఆ ఘటనకు కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న తోట త్రిమూర్తులు పై రాజ్యసభ ఎంపి పిల్లి సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు.
గడచిన 23 ఏళ్ళుగా తనకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకునే తోట శిరోముండనం కేసు విచారణ నుండి తప్పించుకుంటున్నట్లు పిల్లి తాజాగా ఆరోపణలు చేశారు. అసలు శిక్షనుండి తప్పించుకునేందుకే తోట తరచూ పార్టీలు మారుతుంటారనే ఆరోపణలు కూడా అందరికీ తెలిసిందే. ఇదే విషయమై పిల్లి మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి రెండు వైపుల లాయర్లను తానే పెట్టుకుంటే ఎలా అంటు ఎద్దేవా చేశారు.
రెండు వైపులా లాయర్లను తానే పెట్టుకునే బదులు తానే తీర్పు కూడా ఇచ్చేసుకోవచ్చు కదా అంటూ మండిపడ్డారు. సంవత్సరాల తరబడి తాను ఈ కేసులో పోరాటం చేస్తున్న విషయాన్ని కూడా పిల్లి గుర్తు చేశారు. కేసు సంవత్సరాలుగా నడుస్తున్న కారణంగానే వీళ్ళిద్దరి మధ్య వివాదం కూడా అలాగే నడుస్తోంది.