శ‌బ‌రిమ‌ల ఎపిసోడ్‌ లో పురుషాధిక్య‌త పాళ్లు ఎంత‌?

Update: 2018-10-20 04:54 GMT
ప్ర‌భుత్వం పూనుకుంటే కోట్ల మంది మ‌నోభావాల్ని తొక్క తీసిన‌ట్లుగా తీసి అవ‌త‌ల‌కు పారేయ‌టం మ‌న ప్ర‌జాస్వామ్యంలో మామూలే. తాజాగా కేర‌ళ ఎపిసోడ్‌ ను చూస్తే.. ఇదే విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది. శ‌బ‌రిమ‌ల‌లోని అయ్య‌ప్ప‌ను ద‌ర్శించుకోవ‌టం అన్న‌ది భ‌క్తి భావంతో చూడాలా?  లేక‌.. వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట కోస‌మ‌న్న‌ట్లు చూడాలా?  అస‌లు దేవుడ‌న్న‌ది ఒక న‌మ్మ‌కం. ఆ న‌మ్మ‌కం అన్న‌ది లేనోళ్లు దేవుడి ద‌గ్గ‌ర‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం ఏంది?

పురుషాధిక్య‌త‌.. మ‌హిళాధిక్య‌త లాంటి మాట‌ల్ని ప‌క్క‌న పెట్టి.. కోట్లాది మంది మ‌నోభావాల్ని.. వారి ఆశ‌ల్ని అప‌హాస్యం  చేస్తే వ‌చ్చే లాభ‌మేంది?  అన్న‌ది చూస్తే.. అన‌వ‌స‌ర‌మైన ఉద్రిక్త‌లు త‌ప్పించి ఇంకేమీ ఉండ‌దు. కానీ.. ఇవేమీ ప‌ట్టించుకోకుండా వంద మంది పోలీసుల్ని వెంట పెట్టుకొని కొంద‌రు మ‌హిళ‌లు అయ్య‌ప్ప స‌న్నిధానం వ‌ర‌కూ వెళ్లి రావ‌టం దేనికి నిద‌ర్శ‌నం? వారి చ‌ర్య‌ల‌తో కోట్లాది మందికి ఎలాంటి సందేశాల్ని ఇచ్చిన‌ట్లు?

మీరేమైనా అనుకోండి. మేం చేయాల్సింది చేస్తాం. మిమ్మ‌ల్ని మేం గౌర‌వించ‌టం.. మా పంతం మేం ప్ర‌ద‌ర్శిస్తాం. మీరంతా వ్య‌తిరేకిస్తే.. మేం వెన‌క్కి త‌గ్గితే.. మా మొండిత‌నం మాటేంటి? స‌ంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మార‌టం త‌ప్పించి ఈ మొత్తంలో ఏం సాధించారంటే.. కోట్లాది మంది భావోద్వేగాల్ని ట‌చ్ చేయ‌టం.. వారికి ఆవేద‌న‌ను మిగ‌ల్చ‌టం త‌ప్పించి మ‌రింకేమీ ఉండ‌ద‌న్నది మ‌ర్చిపోకూడ‌దు.

దేశంలో చాలానే అయ్య‌ప్ప దేవాల‌యాలు ఉన్నాయి. వేటికి లేని ఒక ప్ర‌త్యేక‌త శ‌బ‌రిమ‌ల‌కు ఉంద‌న్న‌ది ఒక న‌మ్మ‌కం. అక్క‌డి స్థ‌ల చ‌రిత్ర‌.. ఆల‌య క‌ట్టుబాట్ల‌ను చూస్తే.. అక్క‌డికి కొన్ని వ‌య‌స్కుల మ‌హిళ‌లు మాత్ర‌మే రావాల్సి ఉంటుంది. అంటే.. ఇక్క‌డ పుర‌షాధిక్య‌త అంటూ ఏమీ లేన‌ట్లే. ఎందుకంటే.. పురుషాధిక్య‌త అన్న‌ది ఉంటే.. అస‌లు మ‌హిళ‌ల్నే రానివ్వ‌రు క‌దా? 

ఇక‌.. కేర‌ళ ముఖ్య‌మంత్రి విజ‌య‌న్ మాట‌ల్లో చూస్తే.. కొన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల్ని తొక్కేసేందుకే ఇలాంటి ప‌రిమితులు అంటూ చెప్పిన మాట‌ల్ని చూస్తే.. అందులో డొల్ల‌త‌నం త‌ప్పించి మ‌రింకేమీ ఉండ‌దు. ఎందుకంటే.. శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్పను ద‌ర్శించుకునే భ‌క్తుల‌కు కులాల ప‌రిమితులు ఏమీ లేవు.

కోట్లాది మంది వ‌ద్దంటే వ‌ద్దంటున్న విష‌యాన్ని త‌న వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ఠ‌గా కేర‌ళ ముఖ్య‌మంత్రి విజ‌య‌న్ తీసుకున్నారా? అంటే అవున‌న్న మాట‌ను కొంద‌రు చెబుతుంటారు. స‌హ‌జ‌సిద్ధ క‌మ్యూనిస్ట్ అయిన ఆయ‌న‌.. పంతంతో.. కావాల‌నే
ఇదంతా చేశారా? అన్న చ‌ర్చ ఇప్పుడు సాగుతోంది.

ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ప్ర‌జ‌లు న‌మ్మి చేతికి అధికారం ఇస్తే.. దాన్ని అడ్డుగా పెట్టుకొని ముఖ్య‌మంత్రి త‌న వ్య‌క్తిగ‌త ఇష్టాయిష్టాల్ని అదే ప్ర‌జ‌ల మీద బ‌లవంతంగా రుద్దార‌న్న‌ది ఇప్పుడు వినిపిస్తున్న ఒక మాట‌.

అదే లేకుంటే.. శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి ఏదోలా కొంత‌మంది మ‌హిళ‌లకు వంద మందికి పైగా సాయుధులైన పోలీసుల్ని ప‌హ‌రా పెట్టి.. వారికి పోలీసుల‌ డ్రెస్సులు వేసి మ‌రీ..శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ద‌ర్శ‌నం చేయించటం ద్వారా..  కోట్లాది మంది న‌మ్మ‌కాల్ని తొక్క‌లా తీసిపారేయాల‌న్న ప‌ట్టుద‌ల రాజ్య‌ధ‌ర్మ‌మా?

ఐదేళ్లు మాత్ర‌మే పాలించే అధికారాన్ని ఇచ్చిన ప్ర‌జ‌ల‌కు.. శ‌తాబ్దాల త‌ర‌బ‌డి న‌మ్మే  ఆచారాల్ని.. పంప్ర‌దాయాల్ని ఏదో ర‌కంగా కాల‌రాయాల‌న్న అత్యుత్సాహం దేనికి నిద‌ర్శ‌నం. భ‌విష్య‌త్ త‌రాల‌కు విజ‌య‌న్ లాంటి పాల‌కులు ఇస్తున్న సంకేతాలు ఎలాంటివి? స‌మాజంలో అల‌జడుల‌ను ప్రేరేపించేలా ప్ర‌జాప్ర‌భుత్వం చేసే ప్ర‌య‌త్నాల్ని ఎలా అర్థం చేసుకోవాలి? అన్న‌ది ఇప్పుడు అస‌లుసిస‌లు ప్ర‌శ్న‌గా చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News