అత్యాచారానికి కూడా కోడ్ పెట్టేసిన అరాచ‌కుడీ బాబా

Update: 2017-08-26 10:19 GMT
దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టిస్తున్న‌ గుర్మీత్ బాబా లీల‌లు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. అత్యాచారం కేసులో దోషిగా నిర్దారితుడైన బాబా అమాయ‌కుడు అని కొంద‌రు అంటుంటే...ఆయ‌నో న‌ర‌రూప రాక్ష‌సుడు అని ఇంకొంద‌రు వాపోతున్నారు. అత్యాచారం చేయ‌డానికి ఏకంగా ఓ కోడ్ పెట్టుకొని మ‌రీ ఆశ్ర‌మంలో రాచ‌లీల‌లు నెరిపేవాడ‌ని చెప్తున్నారు. ఇంత‌కీ ఆ కోడ్ ఏంటంటే...పితాజీ మాఫీ! ఈ ప‌దం అస‌లు అర్థం పితాజీ నిన్ను క్ష‌మించాడు అని.

డేరా చీఫ్ గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్ ఆశ్ర‌మంలో మాత్రం పితాజీ మాఫీ అంటే క్ష‌మించ‌డం అనే అర్థం కాదు. మ‌రేంటి? దాని అర్థం రేప్ చేయ‌డం. అవును.. మీరు చ‌దివింది నిజ‌మే.. ఈ విష‌యాల‌న్నీ రేప్ కు గుర‌యిన మ‌హిళ‌లు సీబీఐ కోర్టుకు చెప్పారు. అంతే కాదు.. మ‌హిళ‌ల‌ను అత్యాచారం చేసేట‌ప్పుడు తాను దేవుడి అవ‌తార‌మ‌ని.. తాను దైవాంశ‌సంభూతిడినంటూ గుర్మీత్ వాళ్ల‌కు చెబుతాడ‌ట‌. గుర్మీత్ కు ఆశ్ర‌మంలోని అండ‌ర్ గ్రౌండ్ లో ఓ ప‌ర్స‌న‌ర్ రూమ్ ఉంటుంద‌ట‌. దాన్నే గుఫా అని పిలుస్తార‌ట‌. మ‌హిళ‌ల‌ల‌ను గుఫాలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్ప‌డుతాడ‌ట‌! ఆ గుఫాకు కాప‌లాగా మ‌హిళ‌లే ఉంటార‌ట‌!! గుర్మీత్ ఆశ్ర‌మంలో ఎక్కువ‌గా మ‌హిళ‌లే ఉంటార‌ని... అత‌డి ఆధ్యాత్మిక భావ‌న‌ల‌కు ప్ర‌భావితం అవ‌డం, త‌మ కుటుంబ సభ్యులు కూడా గుర్మీత్ ను అత్యంత విశ్వాసంగా న‌మ్మ‌డం వ‌ల్ల‌నే ఎక్కువ మంది మ‌హిళ‌లు ఆయ‌న ఆశ్ర‌మంలో డేరాలో ఉండ‌టానికి ఇష్ట‌ప‌డ‌తారట‌. ఇక‌... దీన్నే త‌న అవ‌కాశంగా మ‌లుచుకునే గుర్మీత్ మ‌హిళ‌ల‌ల‌ను ముగ్గులోకి లాగి.. త‌న గుఫాలోకి తీసుకెళ్లి అత్యాచారం చేస్తాడ‌ట‌. దీని గురించి బ‌య‌ట ఎవ‌రికీ చెప్పొద్ద‌ని భ‌య‌పెడ‌తాడ‌ట డెరా చీఫ్. అందుకే చాలా మంది మ‌హిళ‌లు ఈ ఘోరాన్ని త‌మ లోనే దాచుకుంటారట‌.

ఆశ్ర‌మంలో చేరిన కొత్త‌లో పితాజీ మాఫీ అంటే త‌న‌కు తెలియ‌ద‌ని.. అక్క‌డి వాళ్లు ``నీకు పితాజీ మాఫీ జ‌రిగిందా?`` అని అడిగేవాళ్ల‌ని.. అయితే.. ఆగ‌స్టు 28, 1999 లో గుర్మీత్ త‌న‌ను రేప్ చేశాక అప్పుడు పితాజీ మాఫీ గురించి తెలిసింద‌ని హ‌ర్యానాలోని య‌మునాన‌గ‌ర్ కు చెందిన‌ మ‌హిళ సీబీఐ కోర్టుకు విన్న‌వించింది. ఇక‌...ఈ అత్యాచారాల కేసులో దోషిగా తేలిన డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్‌కు రోహతక్ జైల్లో రాచ మర్యాదలు కల్పిస్తున్నట్లు సమాచారం. జైల్లో ఆయనకు ప్రత్యేక గది ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. గుర్మీత్‌ కు ఒక అసిస్టెంట్‌ ను కూడా అందుబాటులో ఉంచారట. అంతే కాకుండా మినరల్ వాటర్ ఆయనకు అందిస్తున్నట్లు సమాచారం. 2002లో ఇద్దరు మహిళలను అత్యాచారం చేసిన కేసులో డేరా బాబాను దోషిగా సీబీఐ ప్రత్యేక కోర్టు తేల్చిన విషయం విదితమే. పంచకులలోనే గుర్మీత్‌కు వైద్యపరీక్షలు జరిపి.. అటు నుంచి రోహతక్ జైలుకు ఆయనను తరలించారు. ఈ నెల 28న డేరా బాబాకు శిక్ష ఖరారు కానుంది. ఈ క్రమంలో పంజాబ్, హర్యానా రాష్ర్టాల్లో గుర్మీత్ మద్దతుదారులు హింసకు పాల్పడ్డారు. ఇప్పటి వరకు 30 మంది మృతి చెందగా.. 350 మందికి పైగా గాయపడ్డారు. వందల వాహనాలకు నిప్పు పెట్టారు.
Tags:    

Similar News