కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి పీయూష్ గోయల్ కు చేదు అనుభవం ఎదురైంది. తాజాగా ఆయన అనంతపురం జిల్లా పుట్టపర్తికి వచ్చారు. పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్ నిర్వహిస్తున్న అంతర్జాతీయ యువ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అనంతరం.. అక్కడ నుంచి బెంగళూరు వెళ్లేందుకు ప్రత్యేక హెలికాఫ్టర్ ను సిద్ధం చేసుకున్నారు. అయితే.. పుట్టపర్తి విమానాశ్రయ అధికారులు మాత్రం కేంద్రమంత్రి హెలికాఫ్టర్ కు అనుమతి ఇచ్చేందుకు నో చెప్పేశారు.
తమకున్న నిబంధనల ప్రకారం పుట్టపర్తి విమానాశ్రయంలో హెలికాఫ్టర్ కు అనుమతిచ్చేందుకు 24 గంటల ముందే అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వారు తేల్చి చెప్పారు. విమానాశ్రయంలోకి కేంద్రమంత్రి హెలికాఫ్టర్ ను అనుమతించేందుకు సైతం నో చెప్పటం షాకింగ్ గా మారింది. ల్యాండింగ్ కు సైతం అనుమతి ఇచ్చేందుకు నో చెప్పటంపై కేంద్రమంత్రి ఆగ్రహానికి గురయ్యారు.
అనుకోకుండా చోటు చేసుకునే ఉదంతాల విషయంలో మరీ కఠినంగా వ్యవహరించే కంటే అవసరానికి తగ్గట్లు రూల్స్ ను సడలించుకునే అవకాశం ఉన్నప్పటికీ.. అలాంటిదేమీ లేకుండా పుట్టపర్తి విమానాశ్రయ అధికారులు నో అంటే నో అంటూ తెగేసి చెప్పటం గమనార్హం. దీంతో విమానాశ్రయం బయటనే హెలికాఫ్టర్ ను నిలపాల్సి వచ్చింది. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తిరుగు ప్రయాణంలో మాత్రంలో రోడ్డు మార్గంలో బెంగళూరుకు బయలు దేరి వెళ్లారు. కేంద్రమంత్రికి అనుమతి ఇచ్చేందుకు నో చెప్పేయటం చర్చనీయాంశమైంది.