మనదేశంలో రైలు ప్రయాణమంటే చాలామంది విసుక్కుంటారు. ఏసీలు, స్లీపర్‌క్లాస్ ల మాటేమిటో కానీ.. జనరల్ బోగీల్లో ప్రయాణం మాత్రం నరక ప్రాయంగా ఉంటుంది. కిక్కిరిసిన జనాలతో నిండిపోయి ఉంటుంది. ఇక బాత్ రూమ్ల వంక చూస్తే దడ పుడుతుంది. భోగీల్లో ఎక్కడ చూసినా పాన్ పరాగ్, గుట్కాల కంపు కొడుతూ ఉంటుంది. దీంతో చాలా మంది రైలు ప్రయాణమంటేనే విసుక్కొనే పరిస్థితి నెలకొంది. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు రైలు ఎక్కుతుంటారు.
కాగా తాజాగా ఇండియాలో రెడీ అవుతున్న కొత్త రైలు బోగీలు చూస్తే మతి పోతుంది. ఆ ఆధునికహంగులతో విమానప్రయాణాన్ని తలపించే రీతిలో బోగీలను సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘రైలు అంటే ఇలా ఉండాలి’ అంటున్నారు నెటిజన్లు.
ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థల్లో ఇండియన్ రైల్వేస్ కూడా ఒకటి. ఇందులో 13 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. వేరే ఏరంగంలోనూ ఈ స్థాయిలో ఉద్యోగులు లేరు. మన దేశంలో లక్షా పదిహేను వేల మైళ్ల పొడవున రైలు మార్గాలున్నాయి. 13వేల రైళ్లు ఉన్నాయి. అయితే ఇండియన్ రైల్వే ప్రయాణికులను ఆకట్టుకొనేందుకు తాజాగా ఆధునిక హంగులతో రైళ్లను తయారుచేస్తున్నది. ఇందులో భాగంగా నూతనంగా రూపొందించిన ఓ రైలుకు సంబంధించిన వీడియోను పీయూష్ గోయెల్ షేర్ చేశారు. అయితే ఈ రైళ్లకు ‘విస్తాడోమ్ బోగీలు’ అని పేరుపెట్టారు. ‘ఇందులో ప్రయాణిస్తే మీరు మరిచిపోలేని అనుభవాన్ని పొందుతారు’ అని ఆయన కామెంట్ పెట్టారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : https://twitter.com/PiyushGoyal/status/1344143067935166464