భారత్ - పాకిస్తాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదం ఎప్పుడు పరిష్కారం అవుతుందోనని ఇరు దేశాల్లోని ప్రజాస్వామిక వాదులు ఎదురుచూస్తున్నారు. అయితే.. ఏదో ఒక సమస్య రావడం, శాంతి చర్చలకు విఘాతం కలగడం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో సరిహద్దు వద్ద కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే పాకిస్తాన్ డే సందర్భంగా.. భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు లేఖ రాశారు. దీనికి ప్రతిగా మంగళవారం ప్రత్యుత్తరం రాశారు ఇమ్రాన్. శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యావాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్ అంశాన్ని కూడా ప్రస్తావించారు. భారత్ సహా ఇతర దేశాలతో తాము శాంతి, సహకారాన్ని కోరుకుంటున్నామని పేర్కొన్నారు.
అయితే.. భారత్ - పాక్ మధ్య నెలకొన్న విభేదాలతోపాటు జమ్మూకాశ్మీర్ వివాదానికి ముగింపు పలకాలని పేర్కొన్నారు. ఈ వివాదం పరిష్కారమైతేనే దక్షిణ ఆసియాలో శాంతి, సుస్థిర సాధ్యమవుతాయని తెలిపారు. ఇదంతా చర్చల ద్వారానే సాధ్యమవుతుందని ఇమ్రాన్ తన లేఖలో పేర్కొన్నారు.